మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో తుళ్లూరు పోలీసులు బుధవారం సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, అరెస్టుపై సమాచారంతో ఆయన తన ఫోన్ స్విచాఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో పోలీసులు కొంత సేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వచ్చేశారు.
ఇంకా చదవండి: ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!
ఆ తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేశ్ బుధవారం ఉదయం నుంచి ఎక్కడ ఉన్నారో పోలీసులు విచారణ చేపట్టారు. దాంతో పోలీసులకు ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వెంటనే హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ తదితరులు అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో గుంటూరు, బాపట్ల, పన్నాడుకు చెందిన 12 పోలీసు బృందాలు వారి కోసం వెతుకుతున్నాయి.
ఇంకా చదవండి: ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!
గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించని పవన్ కల్యాణ్.. కారణమెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!
ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!
తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?
ప్రియురాలిని కలవడానికి బురఖాలో వెళ్లిన యువకుడు.. చివరికి జరిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!
నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!
విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!
ప్రభాస్, అల్లు అర్జున్ ఉదారత.. భారీ విరాళాలు ప్రకటించిన స్టార్స్! ఎంతో తెలుసా?
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: