వైసీపీ ఎంపీ విజయసారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఏపీ ప్రభుత్వం విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విశాఖ జిల్లా భీమిలి తీరంలో నేహారెడ్డి సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించగా.. అక్రమ కట్టడాల కింద జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. భీమిలి జోన్ పట్టణ సహాయ ప్రణాళికాధికారి బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు నేహారెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేశారు. భారీ బందోబస్తు నడుమ బీచ్ ఒడ్డున హోటల్ కోసం వేసిన కాంక్రీట్ పిల్లర్స్, గోడలు, ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండే సమయంలో కొందరు ముఖ్య నేతలు ఇక్కడి భూములను దౌర్జన్యంగా ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇంకా చదవండి: వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! సత్యానికి విరుద్ధంగా పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు!
ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్‌తో పాటుగా మరికొందరు కోర్టును ఆశ్రయించారు. వీరి ఫిర్యాదు మేరకు న్యాయస్థానం విచారణ చేపట్టింది. భీమిలి తీరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించింది. వెంటనే వీటిని తొలగించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు కూల్చివేతలకు ముందుకువచ్చారు. దీంతో విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి అక్రమాలను వెంటనే తొలగించాలను ప్రజలు కోరుతున్నారు. ఏపీలో కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా తరహా వ్యవస్థను తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ఇంకా చదవండి: ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!
గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించని పవన్ కల్యాణ్.. కారణమెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!
ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!
తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?
ప్రియురాలిని కలవడానికి బురఖాలో వెళ్లిన యువకుడు.. చివరికి జరిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!
నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!
విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!
ప్రభాస్, అల్లు అర్జున్ ఉదారత.. భారీ విరాళాలు ప్రకటించిన స్టార్స్! ఎంతో తెలుసా?
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: