ఏపీలోని విజయవాడలో వచ్చిన భారీ వరదలు లక్షలాది మందిని ముంచెత్తాయి. ఓవైపు వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అదే సమయంలో వరదలకు కారణాన్ని ప్రస్తావిస్తూ విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న సింగ్ నగర్ లో పర్యటించారు. అనంతరం ప్రభుత్వ తప్పిదం వల్లే వరదలు వచ్చాయంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఘాటుగా స్పందించారు. అసలు మానవ తప్పిదం ఏదో తెలుసా అంటూ ఓ పెద్ద ట్వీట్ పెట్టారు. నాగబాబు తన ట్వీట్ లో విజయవాడ వరదలు మ్యాన్ మేడ్ డిజాస్టర్ (మానవ తప్పిదం) అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు కృష్ణానది వరదల విజిట్ కి వచ్చి, వరదల్ని Man Made Disaster అని సెలవిచ్చారు.
ఇంకా చదవండి: ఇద్దరు కుమార్తెలున్న జగన్! కాదంబరీ జెత్వానీకి అండగా షర్మిల - మరో పోరాటానికి రెడీ!
ఒకసారి క్రింద పేర్కొన్నది చదవండి అంటూ గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో ఈ ఘటన వల్ల 15 మంది గల్లంతుకావడం, ఊర్లు నేలమట్టం కావడాన్ని నాగబాబు ప్రస్తావించారు. విజయవాడ వరదల్ని మానవ తప్పిదం అనరని, అప్పట్లో అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకోవడం అసలైన మానవ తప్పిదమని నాగబాబు తేల్చేశారు. అంతేకాదు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన జగన్ ఈ రెండింటికీ తేడా తెలుసుకోవాలని నాగబాబు చురకలు అంటించారు. చివర్లో వీలైతే ముంపు ప్రాంతాల్ని పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్ధికంగా ఆదుకుంటే బాగుంటుంది, విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బావుంటుందంటూ సలహాలు కూడా ఇచ్చేశారు.
ఇంకా చదవండి: వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!
అమెరికాలో దారుణం.. యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి! అసలు ఏమి జరిగింది అంటే!
నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!
ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!
వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?
94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?
క్రెడిట్ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!
యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..? ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో..
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!
వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!
కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!
మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: