డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు అదిరే గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కీలక అంశాన్ని వెల్లడించింది. రాష్ట్ర ఆర్టీసీకి అవసరమైన కొత్త బస్సులను మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాల అధ్యక్షురాళ్లు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా 600 కొత్త బస్సులు కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
ఇంకా చదవండి: ప్రముఖ పోలీస్ అధికారులు వేధింపులకు పాల్పడిన వివరాలు! జత్వాని కేసులో బడా బాస్ ల హస్తం!
ఈ చర్చలు సఫలం అయితే అప్పుడు మహిళలు బస్సుల యజమానులుగా మారిపోతారని ఆయన తెలిపారు. మరీముఖ్యంగా స్త్రీశక్తి ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వపు మహాలక్ష్మి పథకం ద్వారా అంటే ఉచిత బస్ ప్రయాణం రూపంలో 270 రోజుల్లో 85 కోట్ల మంది రూ.2500 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు చేశారన్నారు. ఏకంగా రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో 64 లక్షల మంది ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందారని గుర్తు చేశారు. ఆర్టీసీకి మహాలక్ష్మి ద్వారా లక్ష్మీ కళ వచ్చిందని అభిప్రాయపడ్డారు. కాగా ఈ కార్యక్రమంలో సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు మనుచౌదరి, పమేలా సత్పతి, ఇంకా మత్స్యశాఖ డైరెక్టర్ ప్రియాంక అలా, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొన్నారు.
ఇంకా చదవండి: రఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపు? అప్పట్లో సీఐడీ కస్టడీలో..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!
మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!
జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?
వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: