ఆధార్ కార్డు.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు ప్రతి ఒక్క దానికి ఆధార్ కార్డు అవసరం అవుతోంది. మీరు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా, లేదంటే పాన్ కార్డు పొందాలన్నా.. రేషన్ కార్డు పొందాలన్నా.. ఇలా దేనికైనా ఆధార్ కావాల్సిందే. అంటే మన దేశంలో ఆధార్ కార్డుకు ఉన్న ప్రాధాన్యత అది. అయితే ఆధార్ కార్డు కలిగిన వారు కచ్చితంగా కొన్ని విషయాలు మాత్రం తెలుసుకోవాల్సిందే. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ఒక వ్యక్తికి కేవలం ఒక ఆధార్ కార్డు మాత్రమే వస్తుంది. అందువల్ల ఆధార్ కార్డు కలిగిన వారు అందులో వివరాలు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఈ వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు రావొచ్చు. అందుకే ఆధార్ కార్డు కలిగిన వారు వివరాలు చెక్ చేసుకొని తప్పులు ఏమైనా ఉంటే.. వాటిని సరి చేసుకోవచ్చు. సాధారణంగా అయితే ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లి తప్పులను సరి చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా ఈ పని చేసుకోవచ్చు. అయితే పరిమిత సేవలకే ఇది వర్తిస్తుంది.
ఇంకా చదవండి: ఆర్టీసీ ఛైర్మన్ గా దేవినేని ఉమా? మరి టీటీడీ ఛైర్మన్ ఎవరు?
అయితే ఇప్పుడు ఏపీలో ఆధార్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే అంశం. ఎందుకంటే ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే.. సులభంగానే ఇప్పుడు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాల వద్దకు కూడా వెళ్లాల్సిన పని లేదు. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఈ నెల 20 నుంచి 24 వరకు అంగన్వాడీలు, స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల సెంటర్లలో ప్రభుత్వం ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. అందువల్ల మీరు ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తే.. ఈ సేవలు పొందొచ్చు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, ఐదేళ్లు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్, ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన వారికి బయోమెట్రిక్ అప్‌డేట్ వంటి సేవలు పొందొచ్చు. అంతేకాకుండా ఆధార్ కార్డులో పేరు, చిరునామా, మొబైల్ నంబర్ మార్పు వంటి సేవలను అందించనున్నట్లు పేర్కొంది. అందువల్ల మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని చూస్తున్నట్లు అయితే ఈ సర్వీసులు పొందండి. కాగా ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలనే ప్రజలను కోరింది. పదేళ్లకు మించి ఆధార్ కార్డును అప్పడేట్ చేసుకోకపోతే.. మాత్రం వెంటనే ఆ పని పూర్తి చేసుకోవాలని తెలియజేసింది.
ఇంకా చదవండి: మాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
భార్య పేరుపై అప్పు తీసుకున్నారా.. అయితే మీకో శుభవార్త! ఆ వివరాలు మీ కోసం!
సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!
ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!
శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!
ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!
వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!
వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!
ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!
రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?
కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?
సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!
సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?
దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!
కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: