కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. వాలంటీర్లకు త్వరలోనే వారి ఉద్యోగాలు వారికి వచ్చే విధంగా చేస్తామని సీఎం చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు అందించే గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామన్నారు. తాజాగా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వం వాలంటీర్లను 2023 ఆగస్టు నుంచి రెన్యువల్ చేయలేదని.. తాము త్వరలోనే రెన్యువల్ చేస్తామని మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. అయితే అక్టోబర్ నుంచి వీరిని రెన్యువల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లకు జీతాలు పెంచడంతో పాటుగా వారిని కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వారికి హామీ ఇచ్చింది.
ఇంకా చదవండి: కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!
మరి కొన్ని రోజుల్లో వాలంటీర్లకు జీతాలు పెంచి ఉద్యోగాల్లోకి తీసుకుంటామన్నారు. అయితే గత ప్రభుత్వం మాదిరిగా వీరిని సచివాలయాలకు అనుసంధానం చేస్తారా లేదా వేరే శాఖల్లో వీరిని సహాయకులుగా నియమిస్తారా అనేది తేలాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ నుంచి ప్రతి ప్రభుత్వం పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను వాలంటీర్ల ద్వారానే చేసింది. మరి కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ వాలంటీర్లతో కాకుండా సచివాలయ ఉద్యోగులతో చేయించింది. వాలంటీర్ల పేర్లను కూడా మార్చే ఆలోచన కూడా ఉందనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. వాలంటీర్లను ఇకపై గ్రామ సేవక్, వార్డు సేవక్‌గా పేరు మార్చాలనే ఆలోచన కూడా ఉందట. కూటమి ప్రభుత్వం ఇకపై ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్‌ని నియమించి వారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!
ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!
మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?
బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: