తన భార్యను హత్య చేయడమే కాక మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించి, ఆ తర్వాత ఆ అవశేషాలను చెరువులో పడవేశాడు ఓ రాక్షసుడు. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లు భార్య వెంకట మాధవి కనిపించడం లేదని అత్త సుబ్బమ్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. జిల్లెలగూడ న్యూ వెంకటరమణ కాలనీలో నివాసం ఉండే గురుమూర్తికి 13 ఏళ్ల క్రితం వెంకట మాధవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గురుమూర్తి గతంలో ఆర్మీలో పని చేసి రిటైరయ్యాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇంకా చదవండి: నేడు (23/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఈ క్రమంలో ఈ నెల 16న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదంటూ అత్త సుబ్బమ్మతో కలిసి గురుమూర్తి మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్య, భర్తల మధ్య గొడవలు ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా, షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకున్నాడు. తన భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించి ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసులకు తెలిపాడు. గురుమూర్తి తెలిపిన విషయాలపై ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహం అవశేషాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మీర్‌పేట పోలీసులు స్పందిస్తూ, వెంకట మాధవి మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ కేసులో ఆధారాలు లభిస్తే మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్పు చేసి గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నారు.
ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!
ఘోర ప్రమాదం... ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు!
డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ తొలి స్పందన! ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్న..
తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో హై టెన్షన్! రెండో రోజు ఐటీ సోదాలు!
జనసేనానికి భారీ శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం! పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం!
నేషనల్ హైవేలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! తాజాగా రూ.5,417 కోట్లతో... ఈ రూట్ లోనే!
నల్గొండలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే పై దాడి! తమపై ఆయుధాలతో..
రూ.10 వేల పెట్టుబడితో 17 లక్షల ఆదాయం! పోస్ట్ ఆఫీస్ బ్యాంక్‌లో అదిపోయే స్కీమ్!
ఓరి దేవుడా.. తస్మా జాగ్రత్త.. మందులోకి మంచింగ్ గా.. ఈ ఐదు పదార్థాలు తింటే మీ పని అంతే!
ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!
వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: