ప్రేమికుల మధ్య మనస్పర్థలు సహజం. చిన్నచిన్న భేదాభిప్రాయాలు వస్తుంటాయి. మళ్లీ కలిసిపోతుంటారు. అయితే, ఈ ఘటనలో మాత్రం అది అపార్థంగా మారడంతో ప్రియురాలు తట్టుకోలేకపోయింది. మనస్తాపంతో మణికట్టు వద్ద గాయం చేసుకుంది. ఆసుపత్రి బెడ్‌పై ఆమెను అలా చూసిన ప్రియుడి గుండె తట్టుకోలేకపోయింది. స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతంలో జరిగిందీ ఘటన. ప్రియురాలు లా చదువుతుండగా, ప్రియుడు చదువు పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఇంకా చదవండి: వైసీపీకి షాక్.. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! ఎందుకో తెలుసా?
అయితే, ఇటీవల వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అవి కాస్తా అపార్థాలుగా మారడంతో యువతి తట్టుకోలేకపోయింది. పదునైన ఆయుధంతో మణికట్టు వద్ద నరాలు కోసుకుని, ఆ వీడియోను ప్రియుడు అరుణ్ నందా (30)కు పంపింద. ఆ వీడియోను చూసిన అరుణ్ వెంటనే ఆమె వద్దకు వెళ్లి ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితిని చూసిన అరుణ్ స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే అతడు మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.1 కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!
ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన! మత్స్యకారులకు సముద్రంలో వెళ్లవద్దని హెచ్చరిక!
పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!
ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!
ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!
రూ.3 లక్షల 50 వేల జీతం.. పరీక్ష లేకుండా నేరుగా జాబ్, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇదే!
వైసీపీ షాక్.. మాజీ ఎంపీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు! 48 గంటల పాటు..
అర్ధరాత్రి ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియోకాల్! ఎందుకు.. ఎవరు..? తర్వాత ఏమైందంటే?
నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం! ఆ నేతల గుండెల్లో గుబులు! ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఇక ఆ సమస్యలకు చెక్!!
నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.25 వేలు.. ఇలా చేయండి! ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు!
మందు బాబులకు షాక్ - మద్యం ధరల పెంపు! ఒక్క బీరు ఎంతంటే..?
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: