సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ చేతబడి వంటి మూఢనమ్మకాలు తొలగిపోలేదు. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్షుద్ర ఆచారాలకు ఎంతోమంది బలవుతున్నారు. తాజాగా, చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురు హత్యకు గురయ్యారు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. సుక్మా జిల్లాలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇట్కల్ గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. చేతబడి వల్ల ఓ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడన్న అనుమానంతో ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇంకా చదవండి: కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!
ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: