ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతికి మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఉచితంగా అందించడంతో పాటు, తిరుపతి సమీపంలోని ఇతర ప్రముఖ ఆలయాలను కూడా ఈ టూర్ ప్యాకేజీలో కవర్ చేయనుంది ఐఆర్‌సీటీసీ. ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ ప్రతీ రోజూ ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, తిరుచానూర్ ఆలయాలు కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఐఆర్‌సీటీసీ వెంకటాద్రి టూర్ ప్యాకేజీ విశేషాలు చూస్తే మొదటి రోజు రాత్రి 8.05 గంటలకు కాచిగూడలో వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కాలి. రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల దర్శనం ఉంటుంది. లంచ్ తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల దర్శనం ఉంటుంది.
ఇంకా చదవండి: రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!
రాత్రికి తిరుపతిలో బస చేయాలి. మూడో రోజు ఉదయం 8.30 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత సాయంత్రం పర్యాటకుల్ని తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. సాయంత్రం 6.35 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ వెంకటాద్రి టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.5,500 మాత్రమే. స్లీపర్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.5,590, ట్విన్ షేరింగ్‌కు రూ.5,800, సింగిల్ షేరింగ్‌కు రూ.7,670 చెల్లించాలి. ఇక కంఫర్ట్ కేటగిరీలో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.7,370, ట్విన్ షేరింగ్‌కు రూ.7,570, సింగిల్ షేరింగ్‌కు రూ.9,450 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో రైలు ప్రయాణం, తిరుపతిలో ఏసీ హోటల్‌లో బస, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, ఇతర ఆలయాల్లో రెగ్యులర్ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
ఇంకా చదవండి: రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం! 77వేల మంది పదో తరగతి విద్యార్ధులకు!
చిన్న పరిశ్రమల నిర్వాహకులకు చంద్రబాబు గుడ్ న్యూస్! కేంద్ర ప్రభుత్వం ఈ నిధికి రూ.900 కోట్లు!
ఏపీ, తెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు! పొంచి ఉన్న మరో ముప్పు..! ఆ జిల్లాలకు అలర్ట్!
పిఠాపురంలో భారీ వరదలు! నీట మునిగిన డిప్యూటీ సీఎం పొలాలు!
విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి కీలక పదవి! తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం!
18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!
ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!
గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!
గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!
మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!
రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!
అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: