మద్యం ప్రియులకు అలర్ట్. హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్స్ షాపులు (Wine Shops) మూతపడనున్నాయి. వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. వచ్చే మంగళవారం (సెప్టెంబర్ 17) ఉదయం 6 గంటల నుంచి బుధవారం (18వ తేదీ) సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులను బంద్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైన్ షాపులతోపాటు రెండు రోజులపాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఇది వర్తించదని వెల్లడించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా చదవండి: మాజీ మంత్రికి మరింత బిగుస్తున్న ఉచ్చు! ఏసీబీ పిటీషన్లపై విచారణ వాయిదా!
ఇంకా చదవండి: టోల్ గేట్లలో కీలక మార్పులు! ఇక ఆ వాహనదారులకు చార్జీలు ఉండవు!
ఈ నెల 17న ఖైరతాబాద్ వినాయకుడితోపాటు నగరంలోని గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలుగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నగరంలోని మద్యం, కల్లు దుకాణాలు మూసేయనున్నారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 కింద ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమించి షాపులు తెరిచినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి కీలక పదవి! తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం!
18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!
ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!
గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఉద్యోగులపై కేసు!
గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: