విశాఖ నుంచి విజయవాడ రాకపోకల కోసం ప్రత్యేకించి విశాఖవాసులు చాలా ప్రయాణ మార్గాలు వెతుకుతూ ఉంటారు. ఇందులో కొంతమంది బస్సులో వెళ్తే కొంతమంది రైలులో వెళ్తుంటారు. చాలా వరకు టైం సేవ్ చేసుకోవడానికి విమాన సర్వీసులలో వెళ్లడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే విశాఖ నుంచి విజయవాడకు ఎక్కువగా విమాన సర్వీసులు లేవు. ఈ నేపథ్యంలో విజయవాడ వెళ్లడానికి చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో విమానయాన శాఖ ఒక ప్రత్యేకమైన ప్రకటన చేసింది. విమానయాన శాఖ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా ఒక ప్రకటన చేశారు. వచ్చేనెల అంటే అక్టోబర్ 27 నుంచి ఒక కొత్త విమాన సర్వీస్ విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్యలో ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. విశాఖలో ‘డిజి యాత్ర’ సేవలు ప్రారంభం. విశాఖ విజయవాడ మధ్య అక్టోబర్ 27 నుంచి కొత్తగా విమాన సర్వీసును ప్రారంభించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహననాయుడు అన్నారు. విశాఖ ఎయిర్ పోర్టు సహా దేశంలోని తొమ్మిది ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికుల ‘డిజి యాత్ర’ సేవలను ఆయన విశాఖలో శుక్రవారం ప్రారంభించారు.
ఇంకా చదవండి: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం చంద్రబాబు! వరద పరిస్థితులు, సహాయక చర్యలపై వివరణ!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్ పోర్టు టెర్మినల్‌లోకి ప్రయాణికులు ప్రవేశించగానే పలు రకాల చెకింగ్‌లు, అంతరాయాలతో నిమిషాల పాటు సమయం పట్టేదని, డిజి యాత్ర సేవల ద్వారా సెక్యూరిటీ క్లియరెన్స్‌లు ఐదు సెకన్లలో జరిగిపోతాయని తెలిపారు. పాసింజర్లు సులువుగా ప్రయాణించేందుకు వీలుగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (డిజి యాత్ర)ని ప్రారంభిస్తున్నామన్నారు. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు ఆగకుండా ముందుకు సాగేందుకు డిజి సేవలు దోహదపడతాయని తెలిపారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచే ఆన్‌లైన్ ద్వారా రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, రారుపూర్, పాట్నా, గోవా, కోయంబత్తూరుల్లో డిజి యాత్ర సేవలను మంత్రి ప్రారంభించారు. తాజా వాటితో కలిపి మొత్తంగా దేశంలో 24 విమానాశ్రయాల్లో డిజి యాత్ర సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇంతవరకూ మూడు కోట్ల మంది ప్రయాణికులు డిజి యాత్ర సేవలను వినియోగిస్తున్నారని తెలిపారు. డిజి యాత్ర సేవలకు సంబంధించిన యాప్‌ను దేశంలో 54 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకుని వాడుతున్నారన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు విశాఖ నుంచి కనెక్టివిటీ, బ్రిడ్జిల నిర్మాణం వంటి వాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ ఎంపి ఎం.శ్రీభరత్, ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) చైర్మన్ సురేష్, విశాఖ ఎయిర్ పోర్టు డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు.
ఇంకా చదవండి: జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!
భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!
ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!
స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!
హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: