ప్రభుత్వ సేవలు పొందేందుకు, గుర్తింపు నిర్ధారణకు అత్యంత ప్రామాణికమైన ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ ప్రస్తుతం ఉచితంగా సౌలభ్యం కల్పిస్తోంది. ఈ ఉచిత సర్వీస్ సెప్టెంబర్ 14తో ముగుస్తుంది. ఇప్పటికే యూఐడీఏఐ పలుమార్లు ఈ గడువును పొడిగించింది. దీంతో మరోసారి పెంచుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాబట్టి ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు డెడ్‌లైన్ లోగా త్వరపడడం మంచిది. కాగా ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువును యూఐడీఏఐ అనేకసార్లు పొడిగించింది. మరోసారి పొడగింపుపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న గడువును జూన్ 14న మూడు నెలలపాటు పెంచింది.
ఇంకా చదవండి: ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి! భారీ వర్షాల నేపథ్యంలో పలు సూచనలు చేసిన లోకేశ్
అంతకుముందు గతేడాది డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది మార్చి 14 వరకు పొడిగించింది. కాగా ఆధార్ కార్డ్ వినియోగదారులు గుర్తింపు ఆధారాలు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. గత పదేళ్లలో ఆధార్‌లో చిరునామాను అప్‌డేట్ చేసుకోకుంటే ఎలాంటి ఛార్జీలు లేకుండానే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్‌తో అనుసంధానమైన రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి. దానికి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆధార్‌లో పేరు, మొబైల్ నంబర్, ఫోటో వంటి ఇతర వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటే యూఐడీఏఐ అధికారిక కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. కాగా యూఐడీఏఐ మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులు ప్రతి 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. తద్వారా చిరునామా, ఇతర వివరాలు అప్‌డేట్ అవుతుంటాయని, ప్రభుత్వ పథకాలను పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవని యూఐడీఏఐ చెబుతోంది.
ఇంకా చదవండి: రఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపు? అప్పట్లో సీఐడీ కస్టడీలో..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!
జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?
వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: