కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా సంజయ్ రాయ్‌కి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బాధితురాలిపై దారుణానికి పాల్పడే ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి సంజయ్ రాయ్ పూటుగా మద్యం తాగి, మరో సివిక్ వాలంటీర్ తో కలిసి కోల్‌కతాలోని రెడ్‌లైట్ ఏరియాలకు వెళ్లినట్లు తెలిపాయి. వారిద్దరు కలిసి ఓ ద్విచక్రవాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో మొదట సోనాగచికి వెళ్లారు. అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిలుచోగా, అతడి స్నేహితుడు లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్‌కతాలోని మరో వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను కూడా సంజయ్ రాయ్ వేధింపులకు గురిచేసినట్లు అధికారులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న అతడు మహిళను న్యూడ్ ఫొటోలు కావాలని అడిగినట్లు సమాచారం. ఉదయం 3.50 గంటల సమయంలో ఆర్‌జీకార్ ఆసుపత్రికి చేరుకున్న నిందితుడు.. మొదట ఆపరేషన్ థియేటర్ తలుపును పగలగొట్టాడు. ఆ తర్వాత 4.03 గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్‌లోకి వెళ్లాడు. ఆ సమయంలో సెమినార్ హాల్‌లో గాఢ నిద్రలో ఉన్న బాధితురాలిపై దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇంకా చదవండి: తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐదేళ్ల బుడ్డోడు! ఎందుకో తెలిస్తే! సోషల్ మీడియాలో వీడియో వైరల్!
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి అరెస్ట్!
ఇక ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి 11 గంటల సమయంలో ఆర్‌జీకార్ ఆసుపత్రి వెనక వైపు నిందితుడు సంజయ్ రాయ్ మద్యం సేవించినట్లు పలువురు తెలిపారు. ఆ సమయంలో అశ్లీల వీడియోలు చూసినట్లు పేర్కొన్నారు. మద్యం సేవించాక పలుమార్లు ఆసుపత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, బాధితురాలు చనిపోయిన విషయం ఆగస్టు 9న ఉదయం వెలుగులోకి వచ్చింది. సుమారు 10.53 నిమిషాలకు బాధితురాలి తల్లికి ఈ విషయం చెప్పారు. తొలుత వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఇది హత్యాచారంగా తేలింది. బాధితురాలు చనిపోయిన సెమినార్ హాల్‌లోకి నిందితుడు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో కేసును సీబీఐకి అప్పగించడం జరిగింది.
ఇంకా చదవండి: కొత్త రేషన్ కార్డులు.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!
తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!
ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌కతా హత్యాచార ఘటనపై విజయశాంతి ట్వీట్!
అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: