ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు ఇవాళ తాకిడి పెరిగింది. దీంతో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కాసేపు ఓపెన్ అయిన వెంటనే మొరాయిస్తున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. రేపు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్లకు భూయజమానులు, కొనుగోలుదారులు రావడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు అంటున్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి భూముల ధరలు పెరుగుతుండటం.. నిన్న, మొన్న అమావాస్య సెంటిమెంట్తో నేడు గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీగా భూముల అమ్మకందారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం నుండి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించాయి. రోజు 70 నుండి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో.. నేడు వంద నుండి 150 వరకు పైగా రిజిస్ట్రేషన్లు చేయాల్సి రావటంతో సర్వర్లు డౌన్ అవుతున్నాయని అధికారులు అంటున్నారు. భూముల ధరలు పెరుగుతున్నాయని సమాచారం పూర్తిస్థాయిలో రాలేదని.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతోనే పెద్ద ఎత్తున భూ అమ్మకందారులు రిజిస్ట్రారు కార్యాలయాలకు క్యూ కడుతున్నారని అధికారులు అంటున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..
జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: