ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశముంది. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించనున్నట్లు సమాచారం. తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీవిరమణ తర్వాత ఆయన్ను ఆ పోస్టులో కొనసాగించే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన పదవీవిరమణ చేశాక సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉంటారు. హరీష్ కుమార్ గుప్తా రెండోస్థానంలో ఉన్నారు.
ఇంకా చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఘోర ప్రమాదం... ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు!
డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ తొలి స్పందన! ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్న..
తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో హై టెన్షన్! రెండో రోజు ఐటీ సోదాలు!
జనసేనానికి భారీ శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం! పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం!
నేషనల్ హైవేలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! తాజాగా రూ.5,417 కోట్లతో... ఈ రూట్ లోనే!
రూ.10 వేల పెట్టుబడితో 17 లక్షల ఆదాయం! పోస్ట్ ఆఫీస్ బ్యాంక్‌లో అదిపోయే స్కీమ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: