విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలను బుధవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
“ఈ నెల 28న ఉదయం 5.30 గంటలకు ఎస్.కోట మండలం కొట్టాం గ్రామానికి చెందిన దంతులూరి వెంకటసూర్యనారాయణరాజు ఇంటికి ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. తాము పోలీసులమని, విచారణ నిమిత్తం తీసుకెళ్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత సూర్యనారాయణరాజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 4లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కిడ్నాప్ ఘటనపై 29న ఉదయం సూర్యనారాయణరాజు అల్లుడు కాకార్లపూడి శివప్రసాద్.. ఎస్.కోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎస్ఐ భాస్కరరావు బుధవారం ఉదయం 5గంటలకు ఉసిరి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రెండు కార్లలో వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. గమనించిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. కిడ్నాప్ వ్యవహారం బట్టబయలైంది. ఏడుగురు కిడ్నాపర్ల నుంచి సూర్యనారాయణరాజును పోలీసులు రక్షించారు.
ఇంకా చదవండి: షాకింగ్ న్యూస్: లాడ్జ్‌లో ప్రియురాలితో ఎంపీడీవో.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, పిల్లలు!
ఈ కేసులో ప్రధాన నిందితుడు విశాఖపట్నం మధురవాడ కొమ్మాది ప్రాంతానికి చెందిన కసిరెడ్డి రాజుకు, బాధితుడు సూర్యనారాయణరాజుకు దాదాపు 20 ఏళ్లుగా పరిచయం ఉంది. కొంతకాలంగా కసిరెడ్డి రాజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. సూర్యనారాయణరాజు ఆస్తిపరుడని తెలిసి.. తన ఇద్దరు కుమారులు ప్రవీణ్, సాయి వారి స్నేహితులు మరో నలుగురితో కలిసి కసిరెడ్డి రాజు కిడ్నాప్నకు ప్రణాళిక వేశాడు. ఇందులో భాగంగా ఈనెల 28న అతని ఇంటికి వెళ్లి పోలీసులమని చెప్పి కిడ్నాప్ చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని, మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నాం” అని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: