సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉపాధి నిమిత్తం గ్రామానికి వచ్చారు. ఓ నిర్మాణం వద్ద వారంతా వాచ్మెన్, తదితర విధులను నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చారు. నిర్మాణం వద్ద నివాసం ఉంటున్న అత్త, కోడలిని కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన తండ్రీ, కుమారుడిని బెదిరించారు. ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నిందితులను కఠినంగా శిక్షించాలి: మంత్రి సవిత ఈ ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చిన కుటుంబ సభ్యులను బంధించి అత్తాకోడలిపై అఘాయిత్యానికి పాల్పడి క్షమించరాని నేరం చేశారని తెలిపారు. పండగ వేళ ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సవిత హామీ ఇచ్చారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
డిప్యూటి సీఎం పవన్ ప్రత్యేక శ్రద్ధ.. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజలు! ఎప్పటికప్పుడు అధికారులతో!
వెంటనే ఏపీకి వెళ్లిపోండి - 11 మంది తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం ఆదేశం! కారణం ఏమిటి!
ఏపీలో బయటపడ్డ మరో నగ్న వీడియో! ఈసారి ఆ పార్టీ నేత బుక్కైయ్యడు! అసలు ఏమి జరిగింది!
విజయవాడలో రైతు బజార్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి! వినియోగదారులతో మాట్లాడి వివరాలు!
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా! అనుచిత వ్యాఖ్యలపై కోర్టు నోటీసులు!
రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం... ఏపీ, తెలంగాణకు ఎంతంటే! అత్యధికంగా యూపీకి!
ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్! గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల!
చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంకు భారీ కుంభకోణం! సీఐడీ విచారణలో సంచలన రహస్యాలు!
వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే! కలలో కూడా రెడ్ బుక్కే వస్తుంది!
రెండు రోజుల్లో 2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు పుట్ట గొడుగు! మన్యం అడవుల్లో వింత ప్రకృతి దృశ్యం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: