ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ ను ఎప్పుడైనా చూశారా..? పోనీ ఎక్కడ ఉందో తెలుసా..? అయితే, ఈ వీడియో మీకోసమే. ‘రీజెంట్ ఇంటర్నేషనల్’ .. ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్. ఇది చైనాలోని కియాన్‌జియాంగ్ సెంచురీ నగరంలో ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 20 వేల మందికి పైగా నివాసితులు ఉన్నారు.
ఇంకా చదవండి: సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమీక్ష! రైల్వే, వరద నిధులపై చర్చ!
675 అడుగుల ఎత్తైన ఈ బహుళ అంతస్తుల భవనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా నిలుస్తోంది. మొత్తం 39 అంతస్తుల్లో ఈ భవంతిని ఎంతో అద్భుతంగా నిర్మించారు. 14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ‘ఎస్’ ఆకారంలో నిర్మించారు. ఇందులో గరిష్ఠంగా 30 వేల మంది నివసించొచ్చు. ఇక ఈ భారీ నిర్మాణం అనేక సౌకర్యాలు, వసతులను కలిగి ఉండడం మరో విశేషం.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇందులో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, స్కూళ్లు, హాస్పిటల్స్, స్విమ్మింగ్ పూల్స్, నిత్యవసర దుకాణాలు, సెలూన్లు, పార్కులు.. ఇలా సకల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. నివాసితులు బిల్డింగ్ కాంపౌండ్ కూడా దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్నీ అందులోనే లభిస్తాయట. ప్రస్తుతం ఈ భవంతిలో 20 వేల మంది నివాసం ఉంటున్నారు. మరో 10 వేల మందికి సరిపడా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇక ఇందులో విస్తీర్ణాన్ని బట్టి రూ.18 వేల నుంచి రూ.50 వేల వరకూ రెంట్ ఉంటుందట. ఈ ఆకాశహర్మ్యం 2013లో ప్రారంభమైనప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!
ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!
డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!
ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!
ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!
ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?
అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!
హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: