సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) అంతటా వైరల్ మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన.. కొండా సురేఖ (Konda Surekha) పై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. సోమవారం దీనిపై విచారణ జరగనుంది. అసలేం జరిగిందంటే. కొండా సురేఖ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను (KTR) విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, నాగార్జున (Nagarjuna) పేర్లను ప్రస్తావించారు. వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. ఆ మాటలు వైరల్గా మారాయి. దీనిపై అక్కినేని కుటుంబం, సమంతతో సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాల్లేని వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. ఇలాంటి కామెంట్స్ బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?
పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!
తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!
బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్! మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు!
గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!
హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!
ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: