అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లి కాలేజీ అయిపోయిన తర్వాత పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయ విద్యార్థులు తమ ఉద్యోగాలను వదులుకుంటున్నారు. అమెరికాలో బతికేందుకు పార్ట్ టైం ఉద్యోగాలు ఎంతో అవసరమైనా, తమ భవిష్యత్తును పణంగా పెట్టలేమని విద్యార్థులు చెబుతున్నారు.
ఈ నెల 20న ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో వలసదారులపై కఠిన చర్యలు ఉంటాయని, నిబంధనలు కఠినతరం చేస్తామని ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఎప్-1 వీసాపై అమెరికాలో ఉన్న విద్యార్థులు ఆన్ క్యాంపస్‌లో వారానికి 20 గంటలు మాత్రమే పని చేయాలి. అయితే చాలామంది విద్యార్థులు క్యాంపస్ కాకుండా బయట రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, రిటైల్ స్టోర్లలో పనిచేస్తూ ఖర్చులకు అవసరమైన డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయితే, ఇప్పుడు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అలాంటి ఉద్యోగాలను వదులుకుంటున్నారు.
ఇంకా చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘‘నెలవారీ ఖర్చులు వెళ్లదీసుకోవడం కోసం కాలేజీ అయిపోయిన తర్వాత ఓ చిన్న కేఫ్‌లో పనిచేసేవాడిని. గంటకు 7 డాలర్లు వచ్చేవి. రోజుకు ఆరు గంటల చొప్పున పనిచేసేవాడిని. అది నాకు సౌకర్యంగానే ఉంది. అయితే, ఇలా అనధికారంగా పనిచేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు ఇమిగ్రేషన్ అధికారులు సిద్ధం కావడంతో గత వారమే ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఈ విషయంలో ఎలాంటి పొరపాటు చేయకూడదని అనుకున్నా. ఇక్కడ చదువుకునేందుకు 50 వేల డాలర్లు (దాదాపు రూ. 42 లక్షలు) అప్పు చేసినప్పటికీ ఉద్యోగం వదులుకోక తప్పలేదు’’ అని ఇల్లినాయిస్‌లో చదువుకుంటున్న ఒక భారతీయ విధ్యార్ధి వివరించాడు.
ఇది ఒక్క అర్జున్ పరిస్థితి మాత్రమే కాదు.. అమెరికాలోని వేలాదిమంది భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఇదే. న్యూయార్క్‌లో మాస్టర్స్ చేస్తున్న కొందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తాను రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదని, ఉద్యోగానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తనను ఇక్కడికి పంపేందుకు తన తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేశారని, కాబట్టి ఇప్పుడు బహిష్కరణను కొని తెచ్చుకోలేనని చెప్పారు. ఇప్పుడీ నిర్ణయాలు విద్యార్థులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వారసత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు! జగన్ మళ్లీ సీఎం అయితే? దావోస్ లో చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఆయన నియామకానికి రంగం సిద్ధం! సీనియారిటీ జాబితాలో రెండో స్థానం!
ఓరి దేవుడా.. వీడు అసలు మనిషేనా? ఘోరం... భార్యను చంపి కుక్కర్ లో ఉడికించాడు!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!
ఘోర ప్రమాదం... ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: