అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన 21 ఏళ్ల విద్యార్థినిని భారత సంతతి వ్యక్తి కిరాతకంగా తుపాకీతో కాల్చి చంపేశాడు. హ్యూస్టన్‌లో ఆమె అపార్ట్‌మెంట్‌లో దోపిడీకి యత్నించిన సమయంలో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని 52 ఏళ్ల బాబీ సిన్ షాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కమ్యూనిటీ కళాశాల విద్యార్థిని అయిన మున పాండే సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తన హ్యూస్టన్ అపార్ట్‌మెంట్‌లో తుపాకీ గాయాలతో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆమె అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని సిబ్బంది పోలీసులకు కాల్ చేసి ఈ సంఘటన గురించి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు పాండేను రక్తపుమడుగులో నిర్జీవంగా పడిఉండటాన్ని గుర్తించారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు హత్య జరిగిన రెండు రోజుల తర్వాత సీసీటీవీ ద్వారా ఆమె ఇంటికి వచ్చిన బాబీ సిన్ షా ఫొటోను గుర్తించారు.
ఇంకా చదవండి: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఆ మరుసటి రోజే షాను అరెస్టు చేసి హత్యా నేరం మోపినట్లు పోలీసులు తెలిపారు. 'గోఫండ్‌మీ' పేజీ ప్రకారం మున పాండే 2021లో నేపాల్ నుండి హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లారు. అపార్ట్‌మెంట్‌లో పాండే మృతదేహాన్ని గుర్తించడానికి ముందు ఆమె తల్లి ఆమెతో మాట్లాడటానికి రోజుల తరబడి చాలాసార్లు ప్రయత్నించిందని నేపాల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ సభ్యుడు ఒకరు న్యూయార్క్ పోస్టుతో చెప్పారు. పాండే తల్లి హూస్టన్‌కు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్ల కోసం సహాయం చేసేందుకు నేపాల్ కాన్సులేట్‌తో కలిసి అసోసియేషన్ పని చేస్తోంది. ఇక పాండే అంత్యక్రియతో పాటు ఆమె తల్లిని హ్యూస్టన్‌కు తీసుకురావడానికి గోఫండ్‌మీ పేజీ ద్వారా ఇప్పటివరకు నేపాల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ దాదాపు 30వేల డాలర్ల వరకు పోగు చేసింది.
ఇంకా చదవండి: రఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపు? అప్పట్లో సీఐడీ కస్టడీలో..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!
జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?
వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: