స్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వారి వృత్తిలో బిజీ అయిపోయారు. అయితే, విడాకుల తర్వాత సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో కొంతకాలం సినిమాలకు దూరమైంది. ఈ క్రమంలో ఇటీవల చైతూ రెండో పెళ్లికి రెడీ అయ్యారు. శోభిత ధూళిపాళతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇక ప్రస్తుతం సమంత మళ్లీ నటనలో బిజీ అయ్యారు. ఆమె నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ' త్వరలోనే విడుదల కానుంది. దాంతో ఆమె వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. "నేను ప్రేమించి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ, ఇప్పుడు విడిపోయాం. అందుకే జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి అవసరం లేదు. ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నా" అని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో సమంత కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 'సిటాడెల్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీనికి 'ఫ్యామిలీ మ్యాన్-2' ఫేమ్ రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై అంచనాలను పెంచేసింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలకు తెదేపా సిద్ధం! చంద్రబాబు కీలక ప్రకటన!
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ తెలుగు హీరో! మెగామేనల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు!
తాను మరణించి... ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి! మరొకరికి ఆశను పంచిన జగదీష్ కుటుంబం!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! వారి ఖాతాల్లో నిధులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం..!
ఏపీ ప్రజలకు శుభవార్త: విజయవాడ నుంచి హైదరాబాద్ గంటన్నరే! రికార్డులు బద్దల కొడుతున్న కూటమి ప్రభుత్వం!
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు! నేతలతో చంద్రబాబు భేటీ - కీలక ఆదేశాలు జారీ!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి బంపర్ ఆఫర్! ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం! 48 గంటల్లోపు నగదు జమ!
భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!
రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!
ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: