కోల్‌కత వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై తాజాగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ నేత, సీనియర్ నటి విజయశాంతి స్పందించారు. ఎన్ని నిరసనలు చేసినా అత్యాచార ఘటనలు ఆగడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం, సమాజం, పోలీస్, న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ చివరికి ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా ఈ దారుణాలు ఆగడం లేదని వాపోయారు. తప్పు ఎక్కడ జరుగుతోందన్న ప్రశ్న తన హృదయాన్ని తొలిచివేస్తోందని విజయశాంతి పేర్కొన్నారు. తాజాగా సుప్రీంకోర్టు స్పందించి ఈ కేసును సుమోటోగా స్వీకరించిందని దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందనే నమ్మకం ఉందన్నారు. నేర విచారణ, దోషులకు శిక్షకంటే ముందు అసలు ఇలాంటి దారుణాలకు పూర్తిగా బ్రేక్ పడాలనేదే తన బలమైన ఆకాంక్ష అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో 'ప్రతిఘటన' అవసరమని తన సినిమాలోని పాటను ట్వీట్‌కు జత చేశారు. "కోల్‌కత వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన జరిగి సుమారుగా 10 రోజులు దాటింది.
ఇంకా చదవండి: పాకిస్థాన్‌లో పుట్టి తెలుగు తెరకు పరిచయం అవుతున్న కొత్త భామ! ఓ ఆసక్తికరమైన విషయం!
సాధారణంగా ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడల్లా నేను వెంటనే స్పందిస్తూ నా ఆక్రోశాన్ని, ఆవేదనను వెలిబుచ్చుతుంటాను. కోల్‌కత ఘటన గురించి తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టవచ్చు. కానీ, నాలాగా ఎందరు ఎంతగా ఎంత గొంతు చించుకున్నా, ఎందరెందరో ఎన్నెన్ని నిరసనలు చేసినా ఈ నేరాలు, ఘోరాలు ఎందుకు ఆగడం లేదనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషిస్తూ గతంలో చోటు చేసుకున్న ఇలాంటి హత్యాచార ఘటనల పరిస్థితులు, పరిణామాలపై నాలో నేను సంఘర్షణ పడుతూ ఉన్నాను. ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కుటుంబం, సమాజం, పోలీస్ వ్యవస్థ, న్యాయవ్యవస్థ ఇన్ని ఉన్నప్పటికీ.. తప్పో, ఒప్పో చివరికి ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా ఈ దారుణాలు ఆగడం లేదు. తప్పు ఎక్కడ జరుగుతోందన్న ప్రశ్న నా హృదయాన్ని తొలిచివేస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు స్పందించి ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. విచారణ జరుగుతుంది. దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుంది. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కానీ, దోషులకు శిక్షపడుతుంది కదా.. అని నేరాలను ఉపేక్షించం కదా? నేర విచారణ, దోషులకు శిక్షకంటే ముందు అసలు ఇలాంటి దారుణాలకు పూర్తిగా బ్రేక్ పడాలనేదే నా బలమైన ఆకాంక్ష. ఇందుకు ఇంకెంతకాలం నిరీక్షించాలో కదా" అని విజయశాంతి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇంకా చదవండి: వైసీపీలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరు! అందరూ మాతో టచ్ లోనే ఉన్నారు! ఎప్పుడు వస్తారంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
భార్య పేరుపై అప్పు తీసుకున్నారా.. అయితే మీకో శుభవార్త! ఆ వివరాలు మీ కోసం!
సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!
ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!
శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!
ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!
వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!
వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!
ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!
రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?
కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?
సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!
సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?
దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!
కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: