జబర్దస్త్ రోహిణి తాజాగా ఓ జర్నలిస్టుపై ఫైర్ అయిపోయింది. ఓ విలేకరి అయ్యండీ ఇలా మాట్లాడొచ్చా అంటూ అగ్గిమీద గుగ్గిలమైపోయింది. తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఓ వీడియో కూడా షేర్ చేసింది. ‘‘నేను బర్త్‌డే అనే దానికి ప్రమోషన్ చేశాను. అది వీడియో ప్రమోషన్ కోసం చేశానని మీడియా తెలుసుకుని దానిన్ని ఫన్నీ వీడియోగా తీసుకున్నారు. కానీ, ఓ సీనియర్ జర్నలిస్టు మాత్రం నా గురించి తప్పుగా మాట్లాడారు. ఓ వీడియోలో కూర్చుని నా గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. రేవ్ పార్టీ అనగానే నిజంగానే దొరకే ఉంటుందని, నిప్పు లేకుండా పొగ రాదని అన్నారు. ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలి. ఏమీ తెలియకుండా ఇష్టమొచ్చినట్టు ఎలా మాట్లాడతారు? పైగా ఆయన సీనియర్ జర్నలిస్టు అని చెప్తున్నారు. మరి ఆయన అలా ఎలా మాట్లాడతారు. నేను మందు కూడా తాగను. అందులో చూపించేవి అన్ని నిజం కాదు.
ఇంకా చదవండి: బాలకృష్ణ సినిమా షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్! కాలికి ఫ్రాక్చర్ అయిందన్న చిత్ర యూనిట్!
అలాగే ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడాడు. నేను సర్జరీ చేయించుకోవడం వల్లే లావు అయ్యాను అని అందుకే పెళ్లి కాక అలా ఉండిపోయానని అన్నాడు. లావుగా ఉంటే పెళ్లి కాదా.. సీనియర్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకుని కొట్టే దాన్ని’’ అంటూ ఫైరైపోయింది రోహిణి. ఇటీవల రోహిణి రేవ్ పార్టీలో దొరికిపోయినట్టు ఓ ఫన్నీ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇదంతా ఫన్ కోసం చేసిందని తెలిసి జనాలు స్థిమితపడ్డారు. ప్రమోషన్స్‌లో భాగంగా రోహిణి ఇలా చేసిందని తెలిసి నవ్వుకున్నారు. అయితే, ఓ జర్నలిస్టు మాత్రం వీడియోపై వివాదాస్పద కామెంట్స్ చేసి రోహిణి ఆగ్రహానికి గురయ్యారు.
జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల్లో పాప్యులారిటీ సాధించిన రోహిణ ఆ తరువాత కమెడియన్‌గా పలు షోల్లో నటించి మెప్పించారు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న అతికొద్ది మద్ది టీవీనటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
ఇంకా చదవండి: రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ఐఏఎస్ బదిలీలపై కీలకమైన మార్పులు ! 19 మంది కొత్త పాత్రల్లో !
ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!
ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: