తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ కథానాయకుడిగా కొనసాగుతున్న రాజ్‌తరుణ్.. ఇద్దరు యువతుల వివాదం మధ్యలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ తో తిరగబడరా సామీ చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న మాల్వీ మల్హోత్రా ఈ ఫిర్యాదు చేశారు. తన సోదరుడికి లావణ్య సంక్షిప్త సందేశాలు పంపిస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందనడంతో కేసు నమోదు చేశారు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాయలో పడి తనను దూరం పెట్టాడంటూ లావణ్య అనే యువతి మీడియా ముందుకు వచ్చింది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఆరోపించింది. రాజ్ తరుణ్ ను తాను వదలకపోతే మాల్వీ, ఆమె సోదరుడు కలిసి చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో రాజ్ తరుణ్ కూడా లావణ్యపై కేసు పెట్టాడు.
ఇంకా చదవండి: అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఫిర్యాదు! సోషల్ మీడియాలో కించపరిచేలా!
గతంలో ఆమెతో ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని, కానీ ఆమె మస్తాన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందన్నాడు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందంటూ సంచలనమైన ఆరోపణ చేశాడు. లావణ్య చెప్పేదంతా అబద్దమేనని, రాజ్ తరుణ్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని, గడిచిన ఆరునెలల కాలంలో ఏనాడూ తనతో మాట్లాడింది కూడా లేదని మాల్వి స్పష్టం చేసింది. రాజ్ తరుణ్ తో కలిసి నటించే ప్రతి హీరోయిన్ ను ఆమె ఇలాగే వేధిస్తుంటుందని, తనకు కూడా సంక్షిప్త సందేశాలు పెట్టడం, ఫోన్ చేసి టార్చర్ చేయడంలాంటివన్నీ చేసిందని వెల్లడించింది. అలాగే తన కుటుంబ సభ్యులెవరూ లావణ్యను బెదిరించలేదని, తన పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. తనను, తన తమ్ముడిని లావణ్యే బెదిరింపులకు గురిచేస్తోందని తెలిపింది.
ఇంకా చదవండి: రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీపై ఆగ్రహంగా బంగాళాఖాతం? భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాతావరణ కేంద్రం అలర్ట్!
ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఛార్జీల పెంపు! ఉన్నత విద్య కోసం వెళ్ళే విద్యార్థులకు భారీ షాక్!
ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!
మంత్రులతో కలిసి రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి! ఎందుకో తెలుసా?
మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు! 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి!
అమెరికాలో కాల్పుల మోత! ఇంటి యజమాని సహా నలుగురి మృతి! కాల్చింది ఎవరో కాదు సొంత కొడుకే! కారణం?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: