జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైనశైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు. తన స్కిట్‌లను తానే రాసుకొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్‌నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది.. తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతుంటాడు. జబర్దస్త్‌తో పాటు, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు. హైపర్ ఆది మెగా అభిమాని అనే అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్‌పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన జనసేన తరుఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. హైపర్ ఆది ప్రస్తుతం ఢీ షో చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ యథావిధిగానే కొనసాగుతున్నారు.
ఇంకా చదవండి: పెళ్లికి ముందు ప్రియుడుతో కలిసి ఎంజాయ్ చేసిన అనసూయ! ఫొటోలు వైరల్! ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికి ఏమాత్రం!
తాజాగా దీనికి సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఈ ప్రొమోలో డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌పై తనదైన పంచులు వేస్తూ ఆది రెచ్చిపోయాడు. ఢీ షోకు గెస్టులుగా సుధీర్ బాబు రావడం జరిగింది. శేఖర్ మాస్టర్‌కు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది సుధీర్ బాబు కావడంతో..ఆయన సినిమాకు లింక్ చేస్తూ సెటైర్లు వేశాడు ఆది. హైపర్ ఆది మాట్లాడుతూ.. మీరు ఎస్ఎంఎస్ చిత్రం ఒక్కసారే చేశారు. కానీ శేఖర్ మాస్టర్ కొందరికి ప్రతి రోజు ఎస్ఎంఎస్ చేస్తుంటారు అని సెటైర్ వేశారు. మీ ప్రేమ కథా చిత్రంలో దెయ్యాన్ని చూసి మీరు పారిపోతారు.. కానీ శేఖర్ మాస్టర్ ని చూసి దెయ్యమే పారిపోతుంది అని హైపర్ ఆది మరో పంచ్ వేశాడు. దీనితో కొత్తగా వచ్చిన హన్సిక శేఖర్ మాస్టర్‌కి సపోర్ట్ చేస్తూ హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చారు. ఏయ్ ఆది. శేఖర్ మాస్టర్ చాలా మంచి వారు.. నీ నోరు మూసుకో అంటూ హన్సిక ఇచ్చిన వార్నింగ్ చాలా ఫన్నీగా ఉంది. మీకు నాలుగు రోజుల తర్వాత ఆయన గురించి అర్థం అవుతుంది చూడండంటూ హన్సికకు హైపర్ ఆది కౌంటరిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: