భారతీయ రైల్వే ప్రస్థానం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెట్ వర్క్ పరంగా ప్రస్తుతం నాలుగోస్థానంలో నిలిచింది. ప్రతిరోజు 2 కోట్ల మంది ప్రయాణికులను 13,600 రైళ్లద్వారా వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. 1.30 లక్షల కిలోమీటర్లకు పైగా రైల్వే మార్గం ఉంది. డబుల్ లైన్లు ఉన్నచోట రద్దీని నియంత్రించేందుకు మూడో రైల్వే లైను కూడా నిర్మిస్తున్నారు. సింగిల్ లైన్లు ఉన్నచోట్ల డబుల్ లైన్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. సరకు రవాణా కోసం ప్రత్యేక రైల్వే లైన్లను ఏర్పాటు చేసే యోచనలో భారతీయ రైల్వే ఉంది. భారతదేశంలో అతి పెద్ద రైల్వే జంక్షన్ గా పశ్చిమబెంగాల్ లోని హౌరా జంక్షన్ నిలిచింది. ఈ స్టేషన్ లో 18 ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. ప్రతిరోజు హౌరామీదుగా 600 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిని నియంత్రించడం రైల్వేకు అతి పెద్ద సవాల్ గా మారింది. పశ్చిమబెంగాల్ లోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లాలన్నా హౌరా రావాల్సిందే. రాకపోకలు ఇక్కడినుంచే సాగుతుంటాయి. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద రైల్వే జంక్షన్ గా కూడా రికార్డులకెక్కింది.
ఇంకా చదవండి: విమానాల్లో హ్యాండ్ లగేజీ కోసం కొత్త నిబంధనలు! ఇకపై ఒకే ఒక బ్యాగ్!
భారతదేశంలో ఏ ప్రధాన నగరం నుంచి హౌరాకు రైలు బయలుదేరినా ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటుంది. రిజర్వేషన్ బోగీలు కూడా జనరల్ బోగీల్లా ఉంటాయి. అంతటి రద్దీ హౌరా వెళ్లే రైళ్లల్లో నెలకొంటుంది. ప్రయాణికులను చేరవేసే రైలును తయారుచేయడానికి భారతీయ రైల్వేకు సగటున రూ.70 కోట్లు ఖర్చవుతోంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బోగీలను నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నారు. పట్టాలపై ప్రయాణించేటప్పుడు ఎటువంటి కుదుపులకు లోనవకుండా ఉండేందుకు లింక్డ్ హాఫ్ మన్ బష్ బోగీలను వాడుతున్నారు. ప్రారంభంలో ఇవి జర్మన్ సాంకేతికతతో తయారయ్యేవి. ప్రస్తుతం భారత్ లోనే ఇవి తయారవుతున్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో దాదాపు అన్ని ప్రధాన రైళ్లు ఎల్హెచ్ బీ బోగీలతోనే నడిచే అవకాశం ఉంది. అలాగే ఒక ఇంజన్ తయారు చేసేందుకు రూ.20 నుంచి రూ.22 కోట్ల వ్యయం అవుతోంది. అలాగే ఒక బోగీ తయారీకి రూ.2 నుంచి రూ.3 కోట్ల ఖర్చవుతోంది. రైల్వేకు 100 రూపాయలు వస్తే అందులో నిర్వహణకు 87 రూపాయల వరకు పోతున్నాయి. మిగిలినవన్నీ 13 రూపాయల్లో సర్దుకోవాల్సి ఉంటుంది.
ఇంకా చదవండి: తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..
ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!
అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!
రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!
విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!
ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!
బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!
బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: