ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ రోజు ప్రత్యేకమైన ‘గెట్-అవే సేల్’ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాలకు తక్కువ ధరల్లో టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని ఈ ఆఫర్ ద్వారా అందిస్తోంది. 2025 జనవరి 23 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణాలకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ సేల్ ద్వారా దేశీయ రూట్లలో టిక్కెట్లు రూ.1,199 నుంచి.. అంతర్జాతీయ రూట్లలో రూ.4,499 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 25, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. యాడ్-ఆన్ ఆప్షన్లపై ప్రత్యేక తగ్గింపులు.. ఈ ఆఫర్‌లో భాగంగా.. ఇండిగో ఎంపిక చేసిన యాడ్-ఆన్ ఆప్షన్లపై గరిష్ఠంగా 15 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది.

ఇంకా చదవండి: ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకునేవారికి కీలక అప్డేట్! 2025లో విద్యార్థులకు కొత్త అవకాశాలు!

ఇందులో ప్రీపెయిడ్ అదనపు బ్యాగేజీ (15 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు), ప్రామాణిక సీట్లు, ఎమర్జెన్సీ ఎక్స్‌ఎల్ సీట్లు లాంటి ఎంపికలు ఉన్నాయి. దేశీయంగా రూ.599 నుంచి, అంతర్జాతీయంగా రూ.699 నుంచి యాడ్-ఆన్ ఆప్షన్లు ప్రారంభమవుతున్నాయి. ఫెడరల్ బ్యాంకు కార్డు వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు.. ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఈ ఆఫర్‌లో అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. డిసెంబర్ 31, 2024లోపు టిక్కెట్లు బుక్ చేస్తే.. దేశీయ ప్రయాణాలకు 15 శాతం డిస్కౌంట్, అంతర్జాతీయ ప్రయాణాలకు 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు తమ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను సందర్శించవచ్చని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్‌ను సకాలంలో వినియోగించుకుని రాయితీపై మీ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం ఉత్తమమని సంస్థ సూచించింది. ఈ ఆఫర్ పర్యాటకులకు మరియు వారాంతపు పర్యటనలు ప్లాన్ చేసేవారికి గొప్ప అవకాశంగా నిలుస్తోంది.

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group