వాహనదారులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. టోల్ గేట్లలో కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపింది. కొందరికి రహదారుల్లో తక్కువ దూరం ప్రయాణించినా టోల్ ఛార్జీలు పడుతున్నాయి. అలాంటి వారందరికీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇకపై శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు అమలు చేయబోతున్నట్లు తెలిపింది. ఈ విధానానికి కేంద్రం ఉపరితల రవాణా శాఖ నోటిఫై చేసింది. ఈ క్రమంలోనే నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జీపీఎస్ (శాటిలైట్) ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ ఏర్పాటుకు పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇక దేశంలోని టోల్ గేట్ల వద్ద గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ఆధారంగా టోల్ ఛార్జీలు వసూలు చేసే విధానం అమలులోకి రానుంది. దీంతో రహదారులపై టోల్ విధానంలో వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టినట్లయింది. ఈ విధానం ప్రకారం, వాహనదారులు రహదారులపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జ్ పడుతుంది. కిలోమీటర్ల లెక్కన టోల్ చార్జెస్ ఉంటాయి.
ఇంకా చదవండి: బైక్,స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! హెల్మెట్ పెట్టుకున్నా మీ లైసెన్స్ రద్దు, ఈ తప్పు చేయొద్దు, కొత్త రూల్స్!
ఈ కొత్త టెక్నాలజీ వల్ల టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు.. వాహనం ప్రయాణించే కచ్చిత దూరాలకే టోల్ ఛార్జీలు పడేలా చూసుకుంటుంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికత వంటి వాటికి అదనంగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చుతారు. తద్వారా ఆ వెహికిల్స్ టోల్ గేట్ల మీదుగా వెళ్లినప్పుడు సదరు వాహనం ప్రయాణిచిన దూరానికే టోల్ ఫీ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. అదేవిధంగా టోల్ రోడ్లలో 20KM వరకు జీరో టోల్ కారిడార్ తీసుకొచ్చారు. అంటే ఓ వాహనం నేషనల్ హైవేలపై 20 కిలోమీటర్ల లోపు ప్రయాణిస్తే టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆపైన ప్రయాణించినప్పుడు మాత్రమే దూరాన్ని బట్టి టోల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మొదటగా అన్ని ప్రధాన జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై ఈ కొత్త శాటిలైట్ విధానం అమలు చేసి.. దాన్ని క్రమంగా దేశం మొత్తం విస్తరించాలని కేంద్రం సన్నాహాలు చేస్తోందట. ఈ కొత్త విధానం ద్వారా టోల్ గేట్ల వద్ద రద్దీ కూడా బాగా తగ్గనుంది.
ఇంకా చదవండి: ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!
గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!
మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!
రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!
అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: