రీల్ లైఫ్ విలన్ రియల్ లైఫ్ హీరో సోను సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇటీవల వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన వేళ వారి కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చారు. గతంలో కరోనా మహమ్మారి సమయంలో నేనున్నానంటూ వలస కార్మికులకు భరోసానిచ్చి ఎంతోమందిని ఆదుకున్న సోనూసూద్ తన సేవా కార్యక్రమాలతో భారత దేశ ప్రజలతో మన్ననలు పొందుతున్నారు. ఇక తాజాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిన సినీనటుడు, గొప్ప మానవతావాది సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. చాలామంది హీరోల కంటే భారీ మొత్తంలో విరాళాన్ని ప్రకటించి ఆయన తన పెద్ద మనసును మరొక మారు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వరద బాధితులు ఎవరైనా ఎలాంటి సహాయం కావాలన్నా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా పొందవచ్చునని supportus@soodcharityfoundation.org ను సంప్రదించాలని సూచించారు. ఇప్పటికే వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తున్నారు.
ఇంకా చదవండి: భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!
నివాసం కోల్పోయిన వారికి తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ కు సంబంధించిన వ్యక్తులు ఈ మేరకు సేవలు చేస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సోను సూద్ భారీగా విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరొక 2.5 కోట్ల రూపాయలు చొప్పున విరాళం ప్రకటించారు. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా తమ బృందాలు పనిచేస్తాయని సోనుసూద్ పేర్కొన్నారు. ఇక సోను సూద్ ప్రకటన పట్ల ఏపీ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు కష్ట కాలంలో ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ తోడ్పాటు బలాన్ని ఇస్తుందని ఆయన సోను సూద్ విషయంలో కొనియాడారు. సోను సూద్ ఇచ్చిన ఈ భారీ విరాళం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
ఇంకా చదవండి: జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!
ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!
ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!
వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!
వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్! ఎందుకో తెలుసా?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!
ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!
ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!
గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించని పవన్ కల్యాణ్.. కారణమెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!
ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!
తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?
ప్రియురాలిని కలవడానికి బురఖాలో వెళ్లిన యువకుడు.. చివరికి జరిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!
నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!
విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!
ప్రభాస్, అల్లు అర్జున్ ఉదారత.. భారీ విరాళాలు ప్రకటించిన స్టార్స్! ఎంతో తెలుసా?
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: