గత కొన్ని రోజులుగా వరుణుడు కరుణ అన్నదే లేకుండా తెలుగు రాష్ట్రాలపై వర్షాలతో దండయాత్ర చేస్తున్నాడు. బంగాళాఖాతంలో తన విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరోసారి తుపాను రూపంలో ఏపీపైకి దండెత్తనున్నాడు. ప్రస్తుతం బంగాళాఖాతం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లిడించారు. ఈ అల్పపీడనం రేపటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరం వైపుకి కదులుతోందని.. ఇది అక్టోబర్ 24న వాయువ్య బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా మీదుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 24, 25 తేదీల్లో కోస్తాంధ్రపై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఇంకా చదవండి: రోజా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఫైర్! ఏకపక్షంగా తీర్పు ఇచ్చినా సిగ్గు రాలేదా - తమ ప్రభుత్వం వారి ఆచూకీ!

వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడిశా సముద్రం వైపు నుంచి వెనక్కి రావాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ తుపానుకు భారత వాతావరణ శాఖ "దానా" అనే పేరు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ తుపాను అక్టోబర్ 24న ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడనం, తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ దానా తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు తెలంగాణలోని హనుమకొండ, వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన! ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి బంపర్ ఆఫర్.!

రోజాకి టీడీపీ కౌంటర్.. నువ్వు కూడానా శ్రీలతా రెడ్డి అంటూ! మీ పెద్ద సైకో ఇస్తున్న పెర్ఫామెన్స్‌లే! నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు!

దోచుకుని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ! జగన్ పై షర్మిల ఫైర్ - రాజీ చర్చల ప్రచారం వేళ..!

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! దీపావళి కానుక అదరహో! ఆ వివరాలు మీ కోసం!!

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! ఎందుకో తెలుసా?

రూ.1 కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన! మత్స్యకారులకు సముద్రంలో వెళ్లవద్దని హెచ్చరిక!

సీఎం చంద్రబాబుతో, బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌-4 ఫస్ట్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తి! అయిన తరువాత వచ్చిన మార్పులు!

పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!

ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!

ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group