తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాలప్రభావంతో ఏపీ తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని చోట్ల వరదలు కూడా సంభవించాయి. విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తింది. కోట్లలో భారీ నష్టం వాటిల్లింది. దీంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఇటు తెలంగాణలో కూడా ఖమ్మంకు వరద పోటెత్తింది. గత కొన్ని రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు, చెరువులకు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో ఆ నీరు కాస్త కొన్ని చోట్ల గ్రామాలను, ఊర్లను ముంచెత్తింది. గత రెండు రోజులుగా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు ఉందంటున్నారు. వాతావరణ శాఖ అధికారులు. నిన్న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇంకా చదవండి: పిఠాపురంలో భారీ వరదలు! నీట మునిగిన డిప్యూటీ సీఎం పొలాలు!
ఈ ప్రభావంతో.. ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌పై బలంగా ఉంది. దీని కారణంగా ఛత్తీస్‌గఢ్‌పైతో పాటుగా ఒడిస్సా రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే, నిన్న ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇంకా చదవండి: టోల్ గేట్లలో కీలక మార్పులు! ఇక ఆ వాహనదారులకు చార్జీలు ఉండవు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి కీలక పదవి! తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం!
18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!
ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!
గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!
గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!
మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!
రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!
అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: