Earthquake Horror: మెక్సికోలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు..! భయాందోళనలో ప్రజలు..!

2026-01-03 11:24:00
Farmers: కర్నూల్‌ రైతుల ఖాతాల్లో నిధులు…! మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!

మెక్సికోలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో నమోదైన ఈ భూ ప్రకంపనలు మెక్సికో సిటీతో పాటు శాన్ మార్కోస్, అకపుల్కో వంటి ప్రధాన నగరాలను వణికించాయి. భూకంపం ధాటికి భారీ భవనాలు ఊగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్నపళంగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి వీధుల్లోకి చేరారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Traffic Rules: కొత్త రూల్స్ వచ్చేశాయ్! ఇక నుండి అవి తప్పనిసరి... చెల్లించక తప్పదు భారీ మూల్యం!

భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. నివాస సముదాయాలు కూలిపోవడం, భవనాలకు పగుళ్లు రావడం వల్ల ఆస్తి నష్టం భారీగా ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం 50కిపైగా ఇళ్లకు, భవనాలకు పగుళ్లు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పాత భవనాలు, తక్కువ ఎత్తు నివాస గృహాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. అకపుల్కో వంటి పర్యాటక ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం తీవ్రంగా కనిపించింది.

Dwacra Womens: ఏపీలో వారికి పండగే పండగ... సంవత్సరానికి రూ.25 లక్షలు!

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటల సమయంలో మెక్సికో సిటీని భూకంపం ఒక్కసారిగా వణికించింది. ఈ సమయంలో మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్‌బామ్ మీడియా సమావేశంలో పాల్గొంటుండగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రెసిడెంట్‌ను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భూకంప కేంద్రాన్ని శాన్ మార్కోస్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు మెక్సికో నేషనల్ సిస్మోలాజికల్ సర్వీస్ అధికారులు తెలిపారు.

Grok content : Xలో అశ్లీల ట్రెండ్స్‌.. గ్రోక్ దుర్వినియోగంపై సీరియస్!

భూకంపం అనంతరం మెక్సికో ప్రభుత్వం యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావాలని హెచ్చరికలు జారీ చేశారు. మొబైల్ ఫోన్లకు భూకంప హెచ్చరిక అలర్ట్‌లు పంపి ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాణనష్టం మరింత పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్‌బామ్ వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Railway Bridge: ఏపీలో కొత్త రైల్వే బ్రిడ్జి రెడీ..! 40 కిలోమీటర్ల అదనపు ప్రయాణానికి చెక్…!
Government Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! అకౌంట్‌లలోకి డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!
Pawankalyan: ఆ ఆలయానికి రూ.35.19 కోట్ల నిధులు... పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన!
Aadhaar Jobs: 10వ తరగతి అర్హతతో ఆధార్ ఉద్యోగాలు…! 282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
Land Regestration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు!
Praja Vedika: నేడు (3/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →