తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యంగా మారుతోంది. సికింద్రాబాద్ – తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ రైలును ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మోద్రీకరించారు. దాంతో పాటు కొత్త టైమ్‌టేబుల్ను కూడా విడుదల చేశారు.
ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం, శబరి ఎక్స్‌ప్రెస్ రోజూ మధ్యాహ్నం 2:25 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. అలా బయలుదేరిన రైలు తర్వాతి రోజు సాయంత్రం 6:20కు తిరువనంతపురంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, తిరువనంతపురం నుంచి ఉదయం 6:45కు బయలుదేరి, తర్వాతి రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్కి చేరుతుంది.
ఈ మార్పులు 2025 సెప్టెంబర్ 29 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. కొత్త టైమింగ్స్‌తో పాటు, ఇదే మార్గంలో వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గడం ద్వారా ప్రయాణం మరింత వేగవంతం కానుంది. ఇది సీనియర్ సిటిజన్లు, ఉద్యోగులు, విద్యార్థులకు మంచి న్యూస్‌గానే చెప్పవచ్చు.
ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు వంటి ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ మార్గంలోని ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడే మార్పు.
ప్రయాణికులు తమ టిక్కెట్లను ముందుగానే రిజర్వ్ చేసుకోవాలని, కొత్త టైమింగ్స్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.