రవితేజ 'మాస్ జాతర' సెన్సార్ పూర్తి.. విడుదల తేదీ ఖరారు - సెన్సార్ టాక్ ఏంటంటే..!

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రంపై 'మొంథా' (Montha) తుపాను విరుచుకుపడనుందన్న వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. 

Railway Lines: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో రైల్వే లైన్లపై కీలక ప్రకటన! రూ. 316 కోట్లతో...

యూఏఈ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు (Collectors), ఎస్పీలు (SPs), ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. 

నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు! ఖాతాదారులు తప్పక తెలుసుకోండి!

తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని ఆయన స్పష్టం చేశారు.

Kurnool incident: కర్నూలు ఘటనపై సోనూసూద్ స్పందన.. శివశంకర్ స్పాట్‌లోనే మృతి.. గాయాలతో ఎర్రిస్వామి భయంతో!

వాతావరణ శాఖ జారీ చేసిన రెడ్ అలెర్ట్‌ను (Red Alert) ప్రస్తావిస్తూ సీఎం తుపాను ప్రభావం గురించి కీలక వివరాలను వెల్లడించారు. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తుపాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని సీఎం తెలిపారు.

Express Ways: ప్రపంచంలోనే పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌లు ఉన్న టాప్ 10 దేశాలు! ఆసియా నుండి..

ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ సాయంత్రం కాకినాడ (Kakinada) సమీపంలో 'మొంథా' తీవ్ర తుపానుగా (Severe Cyclonic Storm) తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు.

Cyclone Holiday: ఏపీలో స్కూళ్లకు మూడు రోజుల సెలవులు! ఆ ప్రాంతాల వారికి రెడ్ అలెర్ట్!

దీని ప్రభావం శ్రీకాకుళం (Srikakulam) నుంచి తిరుపతి (Tirupati) వరకు ఉంటుందని, 80 నుంచి 100 మిల్లీమీటర్ల మేర భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వివరించారు.

Bhagavad Gita: తామరాకును నీరు అంటక.. గీతాధ్యానం చేసేవారికి పాపం తగదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -43!

సీఎం చంద్రబాబు విపత్తును ఎదుర్కోవడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. "ఈ విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు."

Win India: RO-KO కాంబినేషన్ అద్భుతం.. భారత్‌కి ఘన విజయం!

ప్రతి జిల్లా కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, తక్షణమే సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన వనరులను (Resources) సమకూర్చుకోవాలని నిర్దేశించారు. తీరప్రాంత ప్రజలకు (Coastal People) తుఫాన్ తీవ్రతపై అవగాహన కల్పించి, వారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

ఏపీలో 182 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ప్లాన్! ప్రభుత్వం ముందడుగు

పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే అధికారాన్ని కలెక్టర్లకే అప్పగించారు. సహాయక చర్యల కోసం వివిధ శాఖల సమన్వయం అవసరమని సీఎం స్పష్టం చేశారు. అన్ని ప్రధాన, మధ్య తరహా జలాశయాల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని, నీటి విడుదలను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు.

Chiranjeevi: కోర్టు కీలక ఆదేశాలు! చిరంజీవి ఫోటోలు, వాయిస్‌, పేరు వాడితే కఠిన చర్యలు!

ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలను ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు తరలించి, సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచాలన్నారు. కాకినాడలో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ సేవలను అందుబాటులో ఉంచాలని ప్రత్యేకంగా సూచించారు.

Screen time : మితిమీరిన స్క్రీన్ టైమ్ ప్రమాదకరం.. చిన్నారుల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం!

ఆర్ అండ్ బీ (R&B), విద్యుత్ (Electricity), నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తాగునీరు (Drinking Water), విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, నిత్యావసరాల పంపిణీ వంటి అత్యవసర సేవలకు (Emergency Services) అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు.

Tollywood update: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. మహేశ్, ఎన్టీఆర్ సినిమాలు కోసం ఆ దేశాలు వెళుతున్నారా?

తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జి అధికారులను నియమించి, క్షేత్రస్థాయిలో నష్ట నివారణ చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు.

Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్! రూ.2,500 కోట్లతో.. ఆ జిల్లాలకు మహర్దశ!
Best Hospital service : 2025లో అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కలిగిన 7 దేశాలు!!