LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Latest News

Vijayawada: విజయవాడలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసుల కఠిన చర్యలు! రంగంలోకి స్పెషల్ టాస్క్‌ఫోర్స్!

Vijayawada: ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో క్రికెట్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. విజయవాడ నగరంలో బెట్టింగ్ నెట్‌వర్క్‌లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

AndhraPravasi News Desk 1 min read
Vijayawada: విజయవాడలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసుల కఠిన చర్యలు! రంగంలోకి స్పెషల్ టాస్క్‌ఫోర్స్!

ఐపీఎల్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌ పై కఠిన చర్యలు..

కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు..

ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో క్రికెట్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. విజయవాడ నగరంలో బెట్టింగ్ నెట్‌వర్క్‌లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సైబర్‌క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. నలుగురు ఏసీపీలతో కలిసి ప్రత్యేకంగా ఈ ఆపరేషన్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

పోలీసులు ఇప్పుడు కేవలం బయట జరుగుతున్న బెట్టింగ్‌కే కాకుండా, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రెండింటిపైనా దృష్టి పెట్టారు. సైబర్ బృందాలు రంగంలోకి దిగి డార్క్ వెబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అనుమానాస్పద లావాదేవీలను విశ్లేషిస్తూ, బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని గుర్తించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు.

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కేసులు నమోదు చేయడం మాత్రమే కాకుండా, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం, బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు యువతకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. “బెట్టింగ్ మాయలో పడితే భవిష్యత్తు నాశనం అవుతుంది. తాత్కాలిక లాభాల కోసం జీవితాన్ని ప్రమాదంలో పడేయొద్దు” అని హెచ్చరించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు జాగ్రత్తగా నిఘా ఉంచాలని సూచించారు. అనుమానాస్పద మార్పులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

బెట్టింగ్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వారు ‘డయల్ 100/112’కు ఫోన్ చేసి తెలియజేయాలని పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఐపీఎల్ సీజన్‌లో బెట్టింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు విజయవాడ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం గమనార్హం.

Be the first to react

More Coverage

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప…