Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే!

2026-01-05 08:54:00
Global Trade Tensions: భారత్‌పై సుంకాల హెచ్చరిక… నేను హ్యాపీగా లేనని మోదీకి తెలుసు..!!

ఆంధ్రప్రదేశ్‌లో న్యూ ఇయర్ మొదలైన కొద్ది రోజులకే చికెన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. గత మూడు నెలలుగా కిలోకు రూ.260 వద్ద స్థిరంగా ఉన్న బ్రాయిలర్ కోడి మాంసం ధర, కేవలం రెండు వారాల్లోనే ఏకంగా రూ.300కు చేరింది. ఇప్పటికే గుడ్ల ధరల పెరుగుదలతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతుండగా, ఇప్పుడు చికెన్ ధరలు కూడా భారంగా మారాయి. సాధారణంగా ప్రతి వారం కొనుగోలు చేసే కుటుంబాలు కూడా ఇప్పుడు చికెన్ కొనాలంటే రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ మాంసం కిలో రూ.300గా ఉండగా, లైవ్ కోడి ధర రూ.170కి చేరింది. ఫారం కోడి మాంసం కిలో రూ.180, బండ కోడి మాంసం రూ.280 వరకు పలుకుతోంది.

War Alert: వెనుజ్వేలాపై రెండో దాడికి సిద్ధం...! ట్రంప్ సంచలన హెచ్చరిక!

ధరలు అనూహ్యంగా పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో కోడి మాంసం వంటలు తప్పనిసరిగా ఉండే కుటుంబాలకు ఈ ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు చికెన్ కొనుగోలు తగ్గించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ధరలు పెరిగిన కారణంగా చాలామంది వారానికి ఒకసారి కొనుగోలు చేసే చికెన్‌ను పక్షవారానికి లేదా నెలకు ఒక్కసారి మాత్రమే కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో మరింత ఎక్కువగా ఉందని సమాచారం.

Health Benefits: ఈ పండు అప్పుడప్పుడు తిన్నా చాలు... ఎన్ని లాభాలో!

ఈ ధరల పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయని పౌల్ట్రీ వ్యాపారులు వివరిస్తున్నారు. కోళ్ల ఫారాల్లో దాణా ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికమవడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అలాగే సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో డిమాండ్ పెరగడం, అదే సమయంలో కోళ్ల ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు దారితీసిందని అంటున్నారు. ఇటీవల కోళ్లకు వ్యాధులు రావడంతో చాలా మంది పౌల్ట్రీ యజమానులు పెంపకాన్ని తగ్గించారని సమాచారం. దీంతో మార్కెట్లో సరఫరా తగ్గి ధరలు మరింత పెరిగాయి. రాబోయే రోజుల్లో కూడా ధరలు తగ్గే అవకాశం తక్కువగానే ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Earthquake News: ఈశాన్య భారత్‌లో 5.1 తీవ్రతతో భూకంపం… ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రాష్ట్రాలు..!!

గత ఏడాది బర్డ్ ఫ్లూ భయంతో కోడి మాంసం ధరలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రజలు చికెన్ కొనుగోలు తగ్గించడంతో ధరలు కనిష్ట స్థాయికి చేరాయి. ప్రభుత్వం, పౌల్ట్రీ రైతులు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో క్రమంగా వినియోగం పెరిగింది. అయినప్పటికీ గత ఏడాది గరిష్ఠంగా కిలో రూ.285 దాటలేదు. డిసెంబర్ 21న కిలో ధర రూ.240గా ఉండగా, వారం రోజుల్లోనే రూ.30 పెరిగింది. గత ఏడాది చివరిలో గరిష్ఠ ధర రూ.280గా నమోదై ఇప్పుడు రూ.300కు చేరింది. ప్రస్తుతం గుడ్డు ధర రెండు వారాలుగా ఒక్కదానికి రూ.8.5గా కొనసాగుతోంది. సంక్రాంతి వరకు గుడ్డు ధరలు కూడా తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. చికెన్ ధరలు పెరగడంతో చాలామంది వినియోగదారులు ప్రత్యామ్నాయంగా చేపల వైపు మొగ్గు చూపుతున్నారు.

AP Power News: విద్యుత్ రంగంలో కొత్త మైలురాయి… 6,009 మెగావాట్ల ఉత్పత్తితో చరిత్ర సృష్టించిన ఏపీ ..!!
Ap students: స్కూల్, కాలేజీ విద్యార్థులకు అలెర్ట్! ఇది మిస్ అయితే పరీక్షలకు ఎంట్రీ లేదు..
Tirupathi : తిరుపతి వెళ్లే వారికి శుభవార్త.. ఆ విమాన సర్వీస్ మళ్లీ మొదలైంది!
బడ్జెట్‌ ధరలో 6000mAh బ్యాటరీ, FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా.. డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్!
Sankranthi movies: సంక్రాంతి ట్రైలర్ ఫీవర్.. మీకు ఏ సినిమా నచ్చింది!
Forbes 40 Under 40: భారత యువత సత్తా.. ఫోర్బ్స్ 40 అండర్ 40లో ఇండియన్ టాలెంట్!

Spotlight

Read More →