అమెరికా కాంగ్రెస్ తాజాగా ఆమోదించిన కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు దేశంలో శాశ్వత నివాస హక్కుతో జీవిస్తున్న గ్రీన్‌కార్డ్ హోల్డర్ల స్థితిగతులపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ఇప్పటివరకు ఒకసారి గ్రీన్‌కార్డ్ పొందిన తర్వాత పెద్దగా జోక్యం ఉండదన్న భావనతో ఉన్న లక్షలాది వలసవాదులకు, ఈ మార్పులు ఒక స్పష్టమైన మలుపుగా మారాయి. ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్‌కార్డ్‌ను ఒక స్థిర హక్కుగా కాకుండా, నిరంతర పర్యవేక్షణలో ఉండే చట్టబద్ధ బాధ్యతగా చూస్తున్నదన్న సంకేతాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ కొత్త నిబంధనల్లో అత్యంత కీలకమైనది భౌతికంగా అమెరికాలో ఉండాల్సిన కాలానికి సంబంధించినది. ఇకపై గ్రీన్‌కార్డ్ హోల్డర్లు ప్రతి ఏడాదిలో కనీసం ఆరు నెలలు అమెరికాలోనే ఉండాలి. (GreenCardHolder) అంతేకాదు మూడు సంవత్సరాల వ్యవధిలో మొత్తం 18 నెలలకు మించి దేశం బయట గడిపితే శాశ్వత నివాసాన్ని వదిలేశారనే అనుమానం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, కుటుంబ కారణాలతో ఎక్కువకాలం బయట ఉండేవారు వారికి ఇది అత్యంత కీలకమైన విషయంగా చెప్పుకోవాలి.
మరో కీలక మార్పు ఏమిటంటే బయోమెట్రిక్స్ అప్‌డేట్ ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేలిముద్రలు, ఫోటోలు, సంతకాలు మళ్లీ నమోదు చేయడం తప్పనిసరి చేశారు. యూఎస్‌సీఐఎస్ పంపే నోటీసును నిర్లక్ష్యం చేస్తే గ్రీన్‌కార్డ్ రద్దుకు దారితీసే అంశంగా మారుతుంది. చిరునామా మారిన వెంటనే అప్‌డేట్ చేయకపోతే నోటీసులు రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ విషయంలోనూ ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకోనుంది. ఇకపై గ్రీన్‌కార్డ్ హోల్డర్లపై నిరంతర నిఘా ఉంటుంది. చిన్న మిస్డీమీనర్ కేసు అయినా సరే, అది ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టికి వెళ్తుంది. గతంలో పెద్దగా పట్టించుకోని చిన్న నేరాలు సైతం ఇప్పుడు డిపోర్టేషన్ ప్రమాదాన్ని పొంచి ఉంది.(Criminal Records)
ట్యాక్స్ వ్యవహారాల్లో కూడా ఎలాంటి సడలింపు లేదు. గ్రీన్‌కార్డ్ హోల్డర్లు ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన ఆదాయంపై అమెరికాలో ట్యాక్స్ ఫైల్ చేయాల్సిందే. గత ఐదేళ్ల ట్యాక్స్ రికార్డులు లేకపోతే పౌరసత్వ దరఖాస్తు మాత్రమే కాదు, గ్రీన్‌కార్డ్ స్టేటస్ కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
పబ్లిక్ బెనిఫిట్స్ వినియోగంపై కూడా కొత్త మార్పులు వచ్చాయి. క్యాష్ అసిస్టెన్స్, ఫుడ్ స్టాంప్స్, మెడికేడ్ వంటి సాయాలు తీసుకుంటే, భవిష్యత్తులో పౌరసత్వం లేదా స్టేటస్ సమీక్షలో అవి ప్రతికూలంగా పరిగణించబడవచ్చు. అలాగే పొరపాటునైనా పౌరసత్వం క్లెయిమ్ చేయడం, ఎన్నికల్లో ఓటు వేయడం వంటి చర్యలకు ఇప్పుడు ఎలాంటి మినహాయింపులు లేవు.
పౌరసత్వ ఇంటర్వ్యూ ప్రక్రియను కూడా మరింత కఠినం చేశారు. ప్రయాణాలు, ఉద్యోగాలు, ట్యాక్స్‌లు, పోలీస్ వ్యవహారాలు అన్నింటినీ లోతుగా పరిశీలిస్తారు. కొన్ని తీవ్రమైన నేరాల విషయంలో పూర్తి విచారణ లేకుండానే త్వరితగతిన డిపోర్ట్ చేసే నిబంధనను కూడా చేర్చారు.
ఈ కొత్త నిబంధనలు గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు ఒక స్పష్టమైన సందేశం (USImmigration ). అమెరికాలో శాశ్వత నివాస హక్కు ఇకపై అలవోకగా కొనసాగించే స్థితి కాదు. ప్రతి నియమాన్ని కచ్చితంగా పాటించాలి, ప్రతి రికార్డును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అర్హత ఉన్నవారు పౌరసత్వం వైపు అడుగులు వేయడమే, ఈ కఠినమైన మారుతున్న ఇమ్మిగ్రేషన్ వాతావరణంలో అత్యంత సురక్షిత మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు.