AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..! Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు! ఐదేళ్లలోపు పిల్లలతో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులకు టీటీడీ గుడ్ న్యూస్: 21న ప్రత్యేక ఏర్పాట్లు! Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్! Champion: శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా.. ఛాంపియన్ ట్రైలర్ విడుదల! Adani Plan: అదానీ మెగా ప్లాన్… 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్! Dhurandhar Movie: ధురంధర్ మూవీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!! Flights Cancelled: ఢిల్లీకి రెడ్ అలర్ట్.. 150కి పైగా విమాన సర్వీసులు రద్దు! Parliament: విపక్ష పాలక పక్షాల మధ్య అరుదైన క్షణం.. ఒకే ఫ్రేమ్‌లో టాప్ లీడర్లు! AP Development: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధికి కేంద్ర నిధులపై కీలక చర్చ!! AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..! Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు! ఐదేళ్లలోపు పిల్లలతో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులకు టీటీడీ గుడ్ న్యూస్: 21న ప్రత్యేక ఏర్పాట్లు! Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్! Champion: శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా.. ఛాంపియన్ ట్రైలర్ విడుదల! Adani Plan: అదానీ మెగా ప్లాన్… 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్! Dhurandhar Movie: ధురంధర్ మూవీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!! Flights Cancelled: ఢిల్లీకి రెడ్ అలర్ట్.. 150కి పైగా విమాన సర్వీసులు రద్దు! Parliament: విపక్ష పాలక పక్షాల మధ్య అరుదైన క్షణం.. ఒకే ఫ్రేమ్‌లో టాప్ లీడర్లు! AP Development: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధికి కేంద్ర నిధులపై కీలక చర్చ!!

NH65: హైదరాబాద్–విజయవాడ 6 లైన్లు హైవే విస్తరణ పై కీలక అప్డేట్!

2025-12-19 12:52:00
AP Govt: నిరుద్యోగులకు గుడ్ న్యూస్…! ఏఐ ఆధారంగా ఉద్యోగ ఎంపిక… డేటాతో డైరెక్ట్ జాబ్స్…!

హైదరాబాద్–విజయవాడ మధ్య ఉన్న అత్యంత కీలకమైన జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–65ను ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టుపై కీలక అప్డేట్ వెలువడింది. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు వరుసలుగా మార్చేందుకు డీపీఆర్ సిద్ధమైనప్పటికీ, పరిపాలనాపరమైన అనుమతుల జాప్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. ఈ విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు 2026–27 ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..! నీటి భద్రతే లక్ష్యం…!

మొత్తం 231.32 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు కేవలం కాగితాలకే పరిమితమవడంతో రోజూ వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఇలాంటి భారీ జాతీయ రహదారి ప్రాజెక్టులకు పలు కమిటీల ఆమోదం అవసరం ఉంటుంది. ఈ డీపీఆర్‌ను ముందుగా ప్రాజెక్టు ఎప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ పరిశీలించాలి. అనంతరం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ఎప్రైజల్ కమిటీ తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం ప్రాజెక్టును మరింత వెనక్కి నెట్టింది.

Festival Season Trains: పండక్కి ఇంటికి వెళ్తున్నారా? విజయవాడ మచిలీపట్నం స్పెషల్ ట్రైన్స్ టైమింగ్స్ చూశారా?

మరోవైపు ఈ హైవేపై ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం ఈ మార్గంలో మొత్తం 17 బ్లాక్‌స్పాట్‌లు ఉన్నాయి. ఒక్కో బ్లాక్‌స్పాట్ వద్ద ఏడాదికి సగటున 20 మంది ప్రాణాలు కోల్పోతుండటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. రహదారి విస్తరణ జరిగితే దాదాపు 60 చిన్న, పెద్ద అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడతారు. ఇవి పూర్తయితే రోడ్డు దాటే వాహనాలకు సౌలభ్యం కలిగి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ సైరెన్.. రానున్న 48 గంటలలో మోస్తారు నుండి భారీ వర్షాలు.! ఇదిగో ఈ ప్రాంతాల్లో..

అయితే శాశ్వత పరిష్కారమైన ఆరు వరుసల విస్తరణకు బదులు, ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ తాత్కాలిక చర్యలకే పరిమితమైంది. రూ.85 లక్షలతో 21 ప్రాంతాల్లో రెండు నెలల కాలపరిమితితో ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని నిర్ణయించింది. కానీ ఇవి ప్రమాదాలను అరికట్టేందుకు సరిపోవని వాహనదారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా తాత్కాలిక మరమ్మతులు ఉపయోగం లేకుండా మారుతున్నాయి.

Bigg boss: అంచనాలను తలకిందులు చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9... గ్రాండ్ ఫినాలేకు మెగా ట్విస్ట్... చీఫ్ గెస్ట్‌గా!

ఈ నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ హైవేను యుద్ధ ప్రాతిపదికన ఆరు వరుసలుగా విస్తరించాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ, ప్రమాదాల సంఖ్యను తగ్గించాలంటే శాశ్వత పరిష్కారమే మార్గమని వారు పేర్కొంటున్నారు. పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగించి, కీలకమైన ఈ రహదారి విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

AP Welfare Schemes: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయో ముందే తెలుసుకోండిలా!
Pension Update: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్…! జిల్లాకు 200 చొప్పున మంజూరు..!
Pakistani begging: గల్ఫ్ దేశాల్లో పాక్ భిక్షాటనకు చెక్.. భారీ స్థాయిలో బహిష్కరణలు!
FLAG సిస్టమ్ ప్రభావం.. అథ్లెట్ల I-140 వీసాలకు కొత్త షరతులు! ఇక నుండి అవి తప్పనిసరి!
Meesho: UBS గ్రీన్ సిగ్నల్‌తో మీషో షేర్ దూకుడు…! లక్ష్య ధర దాటేశింది!

Spotlight

Read More →