దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎదురుచూస్తున్న ముఖ్య సమాచారం వెలువడింది. 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రాబోయే తాజా ఆదాయపు పన్ను చట్టం–2025 నేపథ్యంలో, వ్యక్తిగత మరియు కార్పొరేట్ ట్యాక్స్ పేయర్లకు సంబంధించిన కొత్త ITR ఫారాలను వచ్చే జనవరిలోనే విడుదల చేస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) చైర్మన్ రవి అగర్వాల్ ప్రకటించారు. ట్యాక్స్ వ్యవస్థలో తొలిసారి ఫారాలను మూడు నెలల ముందుగానే తీసుకురావడం విశేషం.
పాత చట్టం ముగింపు… కొత్త చట్టం ప్రారంభం
గత 60 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం–1961 స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన పన్ను చట్టం దేశవ్యాప్తంగా పెద్ద మార్పుని తీసుకురానుంది.
పాత చట్టంలో ఉన్న 819 సెక్షన్లను 536కు తగ్గించడం,
క్లిష్టంగా ఉన్న 5.12 లక్షల పదాలను 2.6 లక్షలకు కుదించడం ద్వారా పన్ను ప్రక్రియను సరళీకరించడం కొత్త చట్టం ప్రధాన లక్ష్యం.
ఈ పెద్ద మార్పుల కారణంగా పన్ను చెల్లింపుదారులు కొత్త నిబంధనలను అవగాహన చేసుకోవడానికి ఎక్కువ సమయం అవసరమవుతుందని సీబీడీటీ భావిస్తోంది. అందుకే ITR ఫారాలు జనవరిలోనే అందుబాటులోకి తెచ్చే యోచనలో కేంద్రం ఉంది.
భారత ట్యాక్స్ పేయర్లకు ఏమి మారబోతోంది?
కొత్త చట్టం అమల్లోకి రావడంతో పాత ఐటీఆర్ ఫారాలు పూర్తిగా రద్దు అవుతాయి. సులభమైన, క్లియర్ ఫార్మాట్లు ప్రత్యామ్నాయంగా వస్తాయి పన్ను వర్గీకరణలు, మినహాయింపులు, TDS విధానాలు కొత్త రూల్స్ ప్రకారం అమలుకానున్నాయి. త్రైమాసిక TDS, TCS ఫారాల డిజైన్ కూడా మారనుంది
ఈ మార్పులన్నీ పన్ను వ్యవస్థను పారదర్శకంగా చేసి రిటర్న్ ఫైలింగ్ సమయంలో జరిగే తప్పిదాలను తగ్గించడమే ముఖ్య ఉద్దేశం.
కొత్త ఫారాలు ముందుగానే రావడం వల్ల లాభాలేమిటి?
ట్యాక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫారాలను ముందుగా విడుదల చేయడం ట్యాక్స్ పేయర్లకు చాలా పెద్ద సహాయం. రిటర్న్ ఫైల్ చేయడానికి తగిన సమయం దొరుకుతుంది కొత్త చట్టం, కొత్త రూల్స్‌ను అర్థం చేసుకునే అవకాశముంటుంది. కంపెనీల పేరోల్ సిస్టమ్స్ ముందుగానే అప్‌డేట్ చేసుకోవచ్చు, అకౌంటెంట్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లకు భారం తగ్గుతుంది రీఫండ్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది.
ప్రదర్శన, TDS, ఆదాయ వర్గీకరణ వంటి అంశాలను ఒకేసారి మార్చాల్సి ఉండటంతో ఈ ముందస్తు నిర్ణయం ట్యాక్స్ పేయర్లను గందరగోళం నుంచి కాపాడుతుందని అధికారులు భావిస్తున్నారు.
కొత్త చట్టం ఎప్పుడు అమలులోకి?
2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుంది.అందుకు ముందు
ఫారాలు విడుదల
నిబంధనల నోటిఫికేషన్
సాంకేతిక మార్పులు
e-filing పోర్టల్ అప్‌డేట్ అన్నీ దశలవారీగా చేపడతామని సీబీడీటీ స్పష్టం చేసింది.
భారత పన్ను వ్యవస్థలో ఇది స్వతంత్ర భారత చరిత్రలో జరిగిన అత్యంత పెద్ద సవరణలలో ఒకటి. కొత్త ఐటీఆర్ ఫారాలను జనవరిలోనే అందుబాటులోకి రావడంతో ట్యాక్స్ పేయర్లకు ముందస్తుగా స్పష్టత లభించనుంది. పన్ను వ్యవహారాలు సులభతరం కావడంతో పాటు ప్రజలు, వ్యాపార సంస్థలు ఈసారైనా రిటర్న్ ఫైలింగ్‌ను ఒత్తిడిలేకుండా పూర్తి చేసుకునే అవకాశం దొరకనుంది.
New ITR Forms: ట్యాక్స్ పేయర్లకు భారీ ఊరట..జనవర్లోనే కొత్త ITR ఫారాలు… సీబీడీటీ కీలక ప్రకటన!!