దేశంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో ఎంత శాతం రాష్ట్రాలకు వెళ్లాలి? ఆ డబ్బును ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి? అనే ఎంతో ముఖ్యమైన విషయాలను చూసే ఫైనాన్స్ కమిషన్ తన తాజా నివేదికను అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు అందించడం జరిగినది. ఈ నివేదిక కేంద్రం–రాజ్యాల ఆర్థిక సంబంధాలపై నేరుగా ప్రభావం చూపనుంది.
పన్ను వాటా పంపిణీకి కొత్త సూత్రాలు
16వ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు పన్ను వాటా నిర్ణయించడానికి కొన్ని ముఖ్యమైన పరామితులను పరిశీలించింది. వాటిలో రాష్ట్రాల జనాభా,అభివృద్ధి స్థాయి, ఆర్థిక పరిస్థితి, సహజ విపత్తుల ప్రభావం భౌగోళిక ప్రత్యేకతలు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏ రాష్ట్రానికి ఎంత శాతం నిధులు రావాలో కొత్తగా లెక్కించినట్లు సమాచారం.
రాష్ట్రాల ప్రధాన డిమాండ్: మాకు మరిన్ని నిధులు కావాలి
కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రంపై విమర్శలు చేశాయి. “మేము ఎక్కువ పన్నులు కడుతున్నాం… కానీ మాకు నిధులు తక్కువగా వస్తున్నాయి” అని ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు 16వ కమిషన్ నివేదిక ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? అన్నది రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
గ్రాంట్లు మరియు ప్రత్యేక నిధుల్లో మార్పులు ఉండే అవకాశంరాష్ట్రాలకు పన్ను వాటా మాత్రమే కాకుండా,విద్య, ఆరోగ్యం,గ్రామీణాభివృద్ధి, పట్టణాల మౌలిక సదుపాయాలు, సహజ విపత్తుల నిర్వహణవంటి ప్రాంతాలకు కేంద్రం ప్రత్యేక నిధులు కూడా ఇస్తుంది.
ఈ నిధుల పద్ధతిలో కొన్ని మార్పులు అవసరమని కమిషన్ సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరదలు, తుఫాన్లు, భూకంపాలు తరచూ ఎదుర్కొనే రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సహాయం ఇవ్వాలని నివేదికలో సూచనలు ఉన్నాయి.
బడ్జెట్ సిద్ధీకరణ కోసం ప్రభుత్వం త్వరపడుతుంది
సాధారణంగా కమిషన్ తుది నివేదిక వచ్చే ఏడాది ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌కు ముందే కొన్ని వివరాలు కావడంతో కమిషన్ ఇదే సమయంలో మధ్యంతర నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల కేటాయింపులను నిర్ణయించనుంది.
ఇప్పుడు అందరి చూపు కేంద్ర నిర్ణయంపై ఈ నివేదికలోని వివరాలను ప్రభుత్వం త్వరలో ప్రజలకు వెల్లడిస్తుంది. ఏ రాష్ట్రానికి ఎంత పెరిగిందో, ఎవరికి ఎంత తగ్గిందో అన్న విషయాలు బయటపడిన తర్వాత రాజకీయ చర్చలు మరింత వేడెక్కనున్నాయి. పరిశ్రమలు, ఆర్థిక నిపుణులు కూడా ఈ నివేదికను చాలా కీలకంగా చూస్తున్నారు, ఎందుకంటే ఈ నిర్ణయం రాష్ట్రాల అభివృద్ధిపై పెద్ద ప్రభావం చూపనుంది.