బ్రిటిష్ కాలం నుండి అమలులో ఉన్న రిజిస్టర్డ్ పోస్టు విధానానికి తెర పడనున్నది. తపాలా శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ సేవను Speed Postలో విలీనం చేయనుంది. వినియోగదారుల అవసరాలు, changing lifestyleకి అనుగుణంగా మరింత వేగవంతమైన మరియు సమర్థవంతమైన సేవల్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ మార్పు తీసుకొచ్చారు.
ఇకపై రిజిస్టర్డ్ పోస్టు సేవలు, స్పీడ్ పోస్టు ద్వారా unified సర్వీస్‌గా అందించబడతాయి. దీంతో ట్రాకింగ్ సిస్టమ్ మరింత సులభతరమవుతుంది. అన్ని పోస్టల్ సేవలూ ఒకే విధానంలో, ఒకే పరిధిలో అందుబాటులోకి రానుండటంతో వినియోగదారులకు ఉపయోగకరంగా మారనుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెయిల్ ఆపరేషన్ డివిజన్లకు తగిన సూచనలు పంపినట్టు తపాలాశాఖ ప్రకటించింది.