ఎండలు కాసీ కాసీ గట్టిపడ్డ మట్టి పెళ్లలపై తొలకరి చినుకులు పడగానే వెదజల్లే సువాసనలను మీరెప్పుడైనా ఆస్వాదించారా? మన్నులో అలాంటి పరిమళాలు ఎందుకు వీస్తాయనే అనుమానం కలిగిందా? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు 1960 కంటే ముందు నుంచే పరిశోధనలు కొనసాగించారు. చివరకు అసలు విషయాన్ని కనుగొన్నారు. అయితే ఆకట్టుకునే ఆ స్మెల్ కు పెట్రిచోర్ (Petrichor) అని పేరు కూడా పెట్టారు. మట్టిలో ఉండే స్ట్రెప్టోమైసెస్ అనే బ్యాటీరియా విడుదల చేసే జియోస్మిన్ అనే రసాయన సమ్మేళనాల కారణంగా మట్టిలో ఈ విధమైన సువాసన వస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఇంకా చదవండి: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ల నియామకంలో ఏపీకి ప్రాధాన్యత! నిధుల కోసం నూతన కమిటీలు!
ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్వచ్ఛమైన మట్టిలో సువాసనలతో పాటు మానవాళికి మేలు చేసే పలు బ్యాక్టీరియాలు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనదేశంలో అయితే పరిమళాలు వెదజల్లే మట్టిని సేకరించి అత్తర్ల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ లో వీటిని తయారు చేస్తున్నారు. అంతేకాకుండా మట్టిలో సువాసనకు కారణమయ్యే స్ట్రెప్టోమైసెస్ బ్యాక్టీరియాను యాంటీ బయోటిక్ మందుల తయారీలోనూ వాడుతుంటారని నిపుణులు చెప్తున్నారు. కాగా అరుదుగా కొందరు మట్టిలో వచ్చే సువాసనకు అట్రాక్ట్ అయి రుచి చూడాలని కూడా అనుకుంటారు. కానీ మట్టిని తినడం మాత్రం అస్సలు మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!
అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!
నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?
అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: