ముంబైలో ఓ వెడ్డింగ్ షూట్ జరుగుతుండగా ఆ జంటకు జీవితాంతం గుర్తుండిపోయే సర్ప్రైజ్ లభించింది. ఈ సర్ప్రైజ్ ఇచ్చింది మరెవరో కాదు, టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, అభిమానుల మనసుల్లో హిట్మ్యాన్‌గా నిలిచిన రోహిత్ శర్మ. ఆ జంట షూట్ జరుగుతున్న ప్రదేశానికి ఎదురుగా ఉన్న జిమ్‌లో రోహిత్ వర్కౌట్స్ చేస్తున్నారు. షూట్ జరుగుతుండగా, వధూవరులను చూసిన రోహిత్ ఒక్కసారిగా ముచ్చటపడి, విండో దగ్గరకు వచ్చి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపారు.
అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉత్సాహంగా మారిపోయింది. రోహిత్ 'ఆజ్ మేరే యార్ కి షాదీ హై' అనే ప్రసిద్ధ బాలీవుడ్ సాంగ్‌ను ప్లే చేస్తూ డాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఆయన అలా డాన్స్ చేస్తుండగా, ఆ వెడ్డింగ్ కపుల్ షాక్ అవుతూ ఆనందంతో మురిసిపోయారు. జంట వెంటనే రోహిత్‌కు నమస్కరించి, ఆయన సర్ప్రైజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అద్భుత క్షణాన్ని షూట్ చేస్తున్న ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌లు తమ కెమెరాల్లో బంధించారు. ఆ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియోలో రోహిత్ శర్మ తన సాదాసీదా అవతారంలో, ట్రైనింగ్ దుస్తుల్లో విండో దగ్గర నిలబడి డాన్స్ చేస్తూ ఉన్నారు. ఆయన స్మైల్, ఎనర్జీ చూసి అక్కడ ఉన్నవాళ్లంతా సంతోషపడ్డారు. రోహిత్ డాన్స్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. “హిట్మ్యాన్ కేవలం గ్రౌండ్‌లోనే కాదు, ఫ్యాన్స్ హృదయాల్లో కూడా సిక్సర్లు కొడుతున్నాడు, ఇదే అసలైన రోహిత్ శర్మ, ఇంత డౌన్ టు ఎర్త్ స్టార్ ఎవ్వరూ లేరు అంటూ అనేకమంది కామెంట్లు చేశారు.
రోహిత్ శర్మ ఎప్పుడూ తన సరళమైన ప్రవర్తన, వినయంతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. స్టార్ ప్లేయర్ అయినా కూడా ఆయన సాధారణ వ్యక్తిలా ప్రవర్తించడం, ఎప్పుడూ స్మైల్‌తో ఉండటం, అందరిని గౌరవించడం ఇవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ప్రత్యేకం చేస్తాయి. ఈ ఘటన కూడా అదే విషయం మరోసారి నిరూపించింది.
ప్రస్తుతం రోహిత్ శర్మ టీమ్ ఇండియాతోపాటు బిజీగా ఉన్నప్పటికీ, ఫిట్నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. మ్యాచ్ షెడ్యూల్స్ మధ్యలో కూడా జిమ్ వర్కౌట్స్ మిస్ అవ్వరు. ఆ రోజూ ఆయన ముంబైలోని ప్రైవేట్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా, ఈ వెడ్డింగ్ షూట్ క్షణం చోటుచేసుకుంది.
ఈ వీడియో కేవలం అభిమానులకు కాకుండా, ఆ జంటకూ జీవితాంతం గుర్తుండిపోయే స్మృతి అయింది. తమ జీవితంలోని అత్యంత ముఖ్యమైన రోజున, టీమ్ ఇండియా కెప్టెన్ స్వయంగా శుభాకాంక్షలు తెలియజేయడం అనేది ఒక డ్రీమ్ మూమెంట్‌గానే వారు భావించారు.
ఇంటర్నెట్‌లో ఈ వీడియోకి ఇప్పటికే లక్షల వ్యూస్ వచ్చాయి. క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సంఘటనను ఎంతో ఆనందంగా షేర్ చేస్తున్నారు. రోహిత్ శర్మ చూపిన ఈ మానవత్వం, సౌమ్యత ఆయనను మళ్లీ ఒకసారి “ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్”గా నిలబెట్టింది.