TTD Updates: 6 అంతస్తుల భవనం.. అద్భుత వసతులు: టీటీడీ జేఈవో క్షేత్రస్థాయి పరిశీలన.! Telangana Politics: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి వివరణ.. వివాదాస్పద మాటల ఉపసంహరణ! Parliament: 2029 లక్ష్యంగా కేంద్రం మాస్టర్ ప్లాన్.. జనగణనతో సంబంధం లేకుండా మహిళా కోటా అమలు! PM Modi: రాజ్యసభలో క్రమశిక్షణకు ఆయనొక పాఠం: హరివంశ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న ప్రధాని.. Constitution Amendment Bill: రాజ్యాంగ సవరణపై పార్లమెంట్‌లో రచ్చ.. బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు! Earthquake: ఏపీలో భూ ప్రకంపనలు.. భయంతో వీధుల్లోకి పరుగులు తీసిన జనం! Automatic Mist Spraying: చంద్రబాబు చల్లని ఐడియా... ఏపీ రోడ్లపై 'ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రేయింగ్'...! Chandrababu: చంద్రబాబు నేటి షెడ్యూల్... పార్టీ కార్యాలయానికి సీఎం, అనంతరం కీలక సమీక్ష! AP Investments: ఏపీలో మరో భారీ పరిశ్రమ... రూ.8,175 కోట్లతో..!! ఆ జిల్లాకు మహర్దశ! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు TTD Updates: 6 అంతస్తుల భవనం.. అద్భుత వసతులు: టీటీడీ జేఈవో క్షేత్రస్థాయి పరిశీలన.! Telangana Politics: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి వివరణ.. వివాదాస్పద మాటల ఉపసంహరణ! Parliament: 2029 లక్ష్యంగా కేంద్రం మాస్టర్ ప్లాన్.. జనగణనతో సంబంధం లేకుండా మహిళా కోటా అమలు! PM Modi: రాజ్యసభలో క్రమశిక్షణకు ఆయనొక పాఠం: హరివంశ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న ప్రధాని.. Constitution Amendment Bill: రాజ్యాంగ సవరణపై పార్లమెంట్‌లో రచ్చ.. బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు! Earthquake: ఏపీలో భూ ప్రకంపనలు.. భయంతో వీధుల్లోకి పరుగులు తీసిన జనం! Automatic Mist Spraying: చంద్రబాబు చల్లని ఐడియా... ఏపీ రోడ్లపై 'ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రేయింగ్'...! Chandrababu: చంద్రబాబు నేటి షెడ్యూల్... పార్టీ కార్యాలయానికి సీఎం, అనంతరం కీలక సమీక్ష! AP Investments: ఏపీలో మరో భారీ పరిశ్రమ... రూ.8,175 కోట్లతో..!! ఆ జిల్లాకు మహర్దశ! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు

Pawan Kalyan: తప్పు చేసి కూడా వైసీపీ నేతలు సమర్థించుకుంటారా? గత టీటీడీ బోర్డుపై పవన్ ఫైర్..!!

Pawan Kalyan Comments on Ycp: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి విషయంలో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో పవన్ కల్యాణ్ ఎండగట్టారు. అసలు అది నెయ్యే కాదని, కేవలం రసాయనాలతో తయారు చేసిన పదార్థమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న తీరుపై ఆయన అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు.

Published : 2026-02-24 14:51:00
  • "అది నెయ్యి కాదు.. కేవలం రసాయనాల మిశ్రమం": అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
     
  • పాలు లేకుండానే నెయ్యి తయారీ.. వైష్ణవి భోలేబాబా సంస్థల గుట్టు రట్టు చేసిన పవన్!

Pawan Kalyan Comments on Ycp: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి విషయంలో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో పవన్ కల్యాణ్ ఎండగట్టారు. అసలు అది నెయ్యే కాదని, కేవలం రసాయనాలతో తయారు చేసిన పదార్థమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న తీరుపై ఆయన అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు.

తిరుమల లడ్డూలకు వాడినది అసలైన నెయ్యి కాదని ఎన్డీడీబీ (NDDB) నివేదిక స్పష్టంగా చెప్పిందని పవన్ గుర్తు చేశారు. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని రిపోర్టులు చెబుతున్నా, వైసీపీ నేతలు మాత్రం ఏమీ జరగనట్లు మాట్లాడుతున్నారని  విమర్శించారు. 
గతంలో దేవాలయాలపై దాడులు జరిగినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు ఇంత పెద్ద తప్పు జరిగినా సమర్థించుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. తప్పు జరిగిందని ఒప్పుకుని ఉంటే ఈ రోజు ఇంత చర్చ అవసరం ఉండేది కాదని హితవు పలికారు.

గత టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ అపచారం జరిగిందని, దీనికి ఆ బోర్డు సభ్యులే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు కనీసం తప్పు చేశామన్న భయం లేదా అని నిలదీశారు. కల్తీ జరిగినట్లు సిట్ (SIT) నివేదికలో కూడా స్పష్టంగా ఉందని ఆయన వివరించారు. వైష్ణవి భోలేబాబా వంటి సంస్థలు అసలు పాలు లేకుండానే నెయ్యిని సృష్టించాయని సిట్ తన రిపోర్టులో పేర్కొందని చెప్పుకోచ్చారు. ఇలాంటి కల్తీ నెయ్యిని వాడి స్వామివారికి అపచారం చేయడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు.

Spotlight

Read More →