PM Modi: విజయవాడ గాయని శ్రీలలితపై మోదీ ప్రశంసల జల్లు.. సోషల్ మీడియాలో వైరల్! Arunachalam: గిరిప్రదక్షిణలో చేసే చిన్న పొరపాట్లు.. కలిగే దోషాల గురించి మీకు తెలుసా? Tirumala Darshanam Timings: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు! Srisailam: శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం..! రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం! Hindu Mythology: తిరుమల రహస్యం.. 200 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వైకుంఠం వెనుక ఉన్న అసలు కథ! ప్రపంచంలోనే మొట్టమొదట ఈద్ ఎక్కడ మొదలవుతుంది? ఆ దేశం స్పెషాలిటీ ఏంటి? Ramzan festival 2026: అరేబియాలో ఒకలా.. ఇండియాలో మరోలా! ఈద్ తేదీల్లో మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు ఫుల్! Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆధునిక టెక్నాలజీతో లగేజీ ట్రాకింగ్..! Pooja Gadi: దేవుడి ఫోటోలను ఎలా శుభ్రం చేయాలి? ఫ్రేమ్‌లు పాడవకుండా ఉండే మార్గాలు..! PM Modi: విజయవాడ గాయని శ్రీలలితపై మోదీ ప్రశంసల జల్లు.. సోషల్ మీడియాలో వైరల్! Arunachalam: గిరిప్రదక్షిణలో చేసే చిన్న పొరపాట్లు.. కలిగే దోషాల గురించి మీకు తెలుసా? Tirumala Darshanam Timings: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు! Srisailam: శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం..! రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం! Hindu Mythology: తిరుమల రహస్యం.. 200 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వైకుంఠం వెనుక ఉన్న అసలు కథ! ప్రపంచంలోనే మొట్టమొదట ఈద్ ఎక్కడ మొదలవుతుంది? ఆ దేశం స్పెషాలిటీ ఏంటి? Ramzan festival 2026: అరేబియాలో ఒకలా.. ఇండియాలో మరోలా! ఈద్ తేదీల్లో మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు ఫుల్! Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆధునిక టెక్నాలజీతో లగేజీ ట్రాకింగ్..! Pooja Gadi: దేవుడి ఫోటోలను ఎలా శుభ్రం చేయాలి? ఫ్రేమ్‌లు పాడవకుండా ఉండే మార్గాలు..!

Bhagavad Gita: పరమాత్మ శక్తిమంతుడు.. గీతామాత పరాశక్తి స్వరూపిణి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 2!

ఓం వ్యాసదేవాయ నమః ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో

Published : 2025-09-13 22:24:14

ఓం వ్యాసదేవాయ నమః 

ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు రెండో నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళి

2. ఓం పరమాత్మ స్వరూపిణ్యై నమః

  అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్‌     

  - శ్రీమద్భగవద్గీత, 10.32

అర్థం: విద్యలలో అధ్యాత్మ విద్య - బ్రహ్మ విద్య - పరావిద్య నా స్వరూపమే అని ఆ తండ్రి చెపుతున్నారు. గీతలో ఉన్నది పరావిద్య. అది సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. 

గీతలో ప్రతి అధ్యాయం చివర, ‘ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే..’ అని ఉంటుంది. అంటే శ్రీకృష్ణార్జున సంవాద రూపంలో ఉన్న ఉపనిషత్తుల సారమైన భగవద్గీత బ్రహ్మవిద్యే అని విష్ణు స్వరూపులైన శ్రీ వ్యాస దేవుల వారు వచనం.

‘గీతా మే హృదయం పార్థ’, ‘గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః’. గీత నా హృదయమే, గీతలోని పరమ విద్య నా స్వరూపమే అని సాక్షాత్తు పరమాత్మే చెపుతున్నారు.

అర్థం: పరమాత్మ శక్తిమంతుడు. గీతామాత పరాశక్తి స్వరూపిణి. శక్తికి, శక్తిమంతునికి ఏ భేదమూ లేదు. అట్టి పరమాత్మ స్వరూపమైన గీతామాతకు పూజ్యభావంతో ప్రణమిల్లుతున్నాను.

ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

జై గురుదేవ్ 

Link 1 : Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1

Spotlight

Read More →