Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం! TTD: శ్రీవారి తల్లి సన్నిధిలో మీ బిడ్డకు అక్షరాభ్యాసం..! టీటీడీ అద్భుత అవకాశం! Tirumala: తిరుమల యాత్రకు వెళ్తున్నారా... నేటి దర్శన సమయాల వివరాలు ఇవే! Tirumala Update: తిరుమల అప్‌డేట్! 29 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్.. పెరిగిన భక్తుల రద్దీ! Tirumala: ఆన్ లైన్ లో శ్రీవారి డాలర్స్! ఎప్పటినుండంటే.... AI Technology: టీటీడీ టెండర్లలో డిజిటల్ విప్లవం! ఇక అక్రమాలకు, మధ్యవర్తులకు చెక్! Tirumala: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక... శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవ వేళల్లో మార్పు! Arunachalam: భక్తులకు అలర్ట్.. 2026లో అరుణాచలం గిరి ప్రదక్షిణకు ముఖ్య తేదీలు! Tirumala Updates: తిరుమల భక్తులకు అలర్ట్! ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు! Tirumala: తిరుమల యాత్రికులకు అలర్ట్... దర్శన సమయాలు మరియు రద్దీ వివరాలు ఇవే! Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం! TTD: శ్రీవారి తల్లి సన్నిధిలో మీ బిడ్డకు అక్షరాభ్యాసం..! టీటీడీ అద్భుత అవకాశం! Tirumala: తిరుమల యాత్రకు వెళ్తున్నారా... నేటి దర్శన సమయాల వివరాలు ఇవే! Tirumala Update: తిరుమల అప్‌డేట్! 29 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్.. పెరిగిన భక్తుల రద్దీ! Tirumala: ఆన్ లైన్ లో శ్రీవారి డాలర్స్! ఎప్పటినుండంటే.... AI Technology: టీటీడీ టెండర్లలో డిజిటల్ విప్లవం! ఇక అక్రమాలకు, మధ్యవర్తులకు చెక్! Tirumala: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక... శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవ వేళల్లో మార్పు! Arunachalam: భక్తులకు అలర్ట్.. 2026లో అరుణాచలం గిరి ప్రదక్షిణకు ముఖ్య తేదీలు! Tirumala Updates: తిరుమల భక్తులకు అలర్ట్! ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు! Tirumala: తిరుమల యాత్రికులకు అలర్ట్... దర్శన సమయాలు మరియు రద్దీ వివరాలు ఇవే!

అందరి చూపు అయోధ్య రామయ్య వైపే... వెళ్ళాలి అని ఉందా?? తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే

: ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్‌ లల్లా ప్రతిష్ఠాప

Published : 2024-01-11 11:56:00

: ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్‌ లల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి, 10 రోజుల పాటు 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు నాలుగు వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

జనవరి 22న పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనుంది. 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పించనున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు రైళ్లు అయోధ్యకు చేరుకుంటాయి. 

యశ్వంతపుర నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రైలు (15024) కాచిగూడ మీదుగా అయోధ్యకు వెళ్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం 10.50 నిమిషాలకు గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (15024) కాచిగూడలో బయల్దేరుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ధర్మవరం, అనంతపురం, కర్నూలు సిటీ, మహబూబ్ నగర్, కాచికూడా, ఖాజీపేట, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో ఆగుంది. 1690 కిలోమీటర్లు ప్రయాణించి శనివారం సాయంత్రం 4.30కు అయోధ్య చేరుకుంటుంది. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అలాగే తమిళనాడు లోని రామేశ్వరం నుంచి విజయవాడ  మీదుగా శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ (22613) అయోధ్యకు వెళ్తుంది. ఈ రైలు విజయవాడలో ప్రతి సోమవారం రాత్రి 8.10 గంటలకు బయల్దేరి 1813 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం తెల్లవారుజామున 4.00 అయోధ్య జంక్షన్‌కు  చేరుకుంటుంది. గూడూరు, విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.  

దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్య పట్టణానికి పోటెత్తనున్నారు. యూపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకూ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు రైలు మార్గంలో అయోధ్యకు చేరేందుకు వీలుగా రైల్వే సర్వీసులను భారీగా పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రామ మందిరం తెరుచున్న తరవాత 100 రోజుల పాటు దేశంలోని పలు చోట్ల నుంచి 1000 రైళ్లు ప్రత్యేకంగా నడపనున్నట్టు వెల్లడించింది. 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →