TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్.. TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్..

TTD: టీటీడీ బోర్డు మీటింగ్‌లో కీలక నిర్ణయం! 5400 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు!

TTD: టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు నేతృత్వంలో జరిగిన పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యార్థం 87 అంశాలపై చర్చించారు. 5400 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు, రిలయన్స్ సంస్థ సహకారంతో అదనపు అన్నదాన భవన నిర్మాణం, అలిపిరిలో అత్యాధునిక తనిఖీ యంత్రాల ఏర్పాటు మరియు విద్యా సంస్థల బలోపేతానికి 116 కోట్ల కేటాయింపు వంటివి ఈ సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Published : 2026-02-28 13:05:00

51 మంది అర్చకులకు ప్రమోషన్లు…

శ్రీవారికి కానుకల సమర్పణ ఇక మరింత ఈజీ…

అలిపిరిలో అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు…

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ధర్మకర్తల మండలి సమావేశం శనివారం అన్నమయ్య భవనంలో అత్యంత కీలకమైన అంశాలతో ప్రారంభమైంది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మరియు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ పరిపాలనలో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా మొత్తం 87 అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు.

ఈ సమావేశంలో ప్రధానంగా భక్తుల అన్నదాన సౌకర్యాల విస్తరణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రపంచస్థాయి సాంకేతికతతో, అత్యాధునిక హంగులతో తిరుమలలో నూతనంగా 'అదనపు అన్నదాన భవనం' ఏర్పాటు చేయాలని బోర్డు భావిస్తోంది. ఈ బృహత్తర ప్రాజెక్టును నిర్మించడానికి ప్రముఖ పారిశ్రామిక సంస్థ 'రిలయన్స్' ముందుకు రావడం విశేషం. దీనివల్ల ప్రతిరోజూ వేల సంఖ్యలో అదనపు భక్తులకు అత్యంత నాణ్యమైన రీతిలో అన్నప్రసాదాన్ని అందించే అవకాశం కలుగుతుంది.

మరోవైపు టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై కూడా మండలి దృష్టి సారించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 5,400 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనలపై సభ్యులు చర్చిస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు 116 కోట్ల రూపాయలను వెచ్చించాలని నిర్ణయించారు. అలాగే, తిరుపతిలోని వకుళమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించే 'గోవింద అక్షరమాల' కార్యక్రమానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

భక్తుల రక్షణ మరియు భద్రత విషయంలో బోర్డు కీలక మార్పులు చేయబోతోంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భక్తుల లగేజీని త్వరగా మరియు సురక్షితంగా తనిఖీ చేసేందుకు అత్యాధునిక 'ఎక్స్-రే బ్యాగేజీ' పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. భద్రతా సిబ్బంది నియామకం కోసం 'ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్' సేవలను వినియోగించుకోవడంపై చర్చలు జరుపుతున్నారు. అలాగే, శ్రీవారికి కానుకలు సమర్పించే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆధునిక సాంకేతికతతో కూడిన 'ముడుపుల పత్రం' విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నారు.

Spotlight

Read More →