నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఉదయం లేచి తాగేది టీ, కాఫీ లేదా చక్కెరతో నిండిన పానీయాలు. కానీ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు — రోజును ఆరోగ్యంగా ప్రారంభించాలంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తీసుకునే మొదటి డ్రింక్ చాలా కీలకం అని. ముఖ్యంగా మధుమేహం బాధపడుతున్నవారికి లేదా దాని నుంచి దూరంగా ఉండాలనుకునేవారికి ఇది మరింత అవసరం.
మధుమేహం ఇప్పుడు కేవలం వృద్ధులకు మాత్రమే కాదు యువతలో కూడా వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాధి శరీరంలోని కళ్ళు, మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. అయితే నిపుణుల సూచన ప్రకారం ప్రతీ ఉదయం కొన్ని సహజ పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఉసిరి లేదా ఆమ్లా విటమిన్ C యొక్క సహజ మూలం. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రక్తం శుద్ధి చేస్తుంది. ప్రతి ఉదయం ఉసిరి రసం తాగడం వల్ల చర్మం, జుట్టు, కళ్ళ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చక్కెర స్థాయిలు స్తిరంగా ఉంటాయి.
మెంతి గింజలు రక్తంలో చక్కెరను తగ్గించడంలో అద్భుత ఫలితాలు ఇస్తాయి. ఇవి ఫైబర్ ఎక్కువగా కలిగి ఉండి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. రాత్రి ఒక చెంచా మెంతిని నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగి గింజలను నమలడం ఉత్తమం.
కాకరకాయను సహజ డయాబెటిస్ కంట్రోలర్‌గా పిలుస్తారు. ఇందులో గ్లూకోజ్ వినియోగాన్ని పెంచే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. తాజాగా చేసిన కాకరకాయ రసాన్ని ఉదయాన్నే తాగడం చాలా ప్రయోజనకరం.
గ్రీన్ టీ కేవలం స్లిమ్ కావాలనుకునే వాళ్లకే కాదు — ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అల్పాహారానికి ముందు గ్రీన్ టీ తాగడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
నిపుణుల ప్రకారం ఈ సహజ పానీయాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాకుండా శరీరం మొత్తానికి శక్తినిస్తాయి. ఒక చిన్న మార్పు — ఉదయం ఖాళీ కడుపుతో ఈ 5 డ్రింక్స్ మీ ఆరోగ్యం బాగా అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యం పదిలం అవుతుంది.
ఇది కేవలం మీకు అవగాహన కలిగించే సమాచారం మాత్రమే మీ ఆరోగ్య పరిస్థితిరిత్యా ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి మీ డాక్టర్ సూచనల మేరకు తీసుకోవడం మంచిది.